అది నా హృదయానికి దగ్గరైన చిత్రం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్
డైరెక్టర్ అట్లీ, దళపతి విజయ్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో మొదటగా వచ్చిన చిత్రం తేరి. తెలుగులో పోలీసోడు అంటూ డబ్ అయింది. తేరి చిత్రం కోలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. అక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. వీరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన తేరి, మెర్సెల్, విజిల్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కాగా.. వేటికదే ప్రత్యేకం. అయితే తేరి సినిమా వచ్చి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
తేరి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఎంతో మంది ప్రయత్నించారు. రవితేజతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని అంతా ఫిక్స్ అయ్యారు కానీ చివరి నిమిషంలో ప్రాజెక్ట్ అటకెక్కింది. అంతటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరు మెర్సెల్ (అదిరింది), బిగిల్ (విజిల్) చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టేశారు. తేరీ నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు అట్లీ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించాడు.

'తేరి నా ఇష్టమైన చిత్రం.. అంతేకాకుండా నా హృదయానికి దగ్గరైన సినిమా.. ఈ క్రెడిట్ అంతా కూడా విజయ్ అన్నకే దక్కుతుంది.. ఆయన లేకుంటే ఏదీ సాధ్యమయ్యేది కాదు.. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు లవ్యూ అన్న.. తేరి బృందానికి నా ప్రేమ.. నిర్మాతకు ధన్యవాదాల'ని డైరెక్టర్ అట్లీ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











