twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్, అట్లీకి షాక్: నా కథ కాపీ కొట్టారు.. కోర్టుకు వెళ్తా... వర్ధమాన దర్శకుడి ఫిర్యాదు

    |

    Recommended Video

    Thlapathy Vijay 63rd Movie Has Run Into Trouble || Filmibeat Telugu

    సంచలన విజయాలను సొంతం చేసుకొంటున్న దర్శకుడు అట్లీ మరోసారి వివాదంలో కూరుకుపోయాడు. థలపతి విజయ్ 63వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్నది. మహిళా ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించిన కథతో ఈ చిత్రం రూపుదిద్దుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన కథను కాపీ కొట్టారంటూ ఓ వర్దమాన దర్శకుడు ఆరోపణలు చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

     విజయ్ 63వ సినిమాపై ఆరోపణలు

    విజయ్ 63వ సినిమాపై ఆరోపణలు

    అట్లీ దర్శకత్వంలో విజయ్ తన కెరీర్‌లో నటించే 63వ చిత్ర కథ నాదు. నా కథను కాపీ కొట్టారంటూ, నా అనుమతి లేకుండా తెరకెక్కిస్తున్నారంటూ వర్థమాన దర్శకుడు శివ ఆరోపణలు చేశారు. ఈ మేరకు దక్షిణా బారత ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరిగేలా కోర్టుకు కూడా వెళ్తానని శివ వెల్లడించినట్టు తమిళ మీడియా కథననాన్ని ప్రచురించింది.

    కథ లీకైంది ఇలా అని

    కథ లీకైంది ఇలా అని

    గతంలో ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలకు శివ కథ నెరేట్ చేశాడు. అందులో ఓ నిర్మాత అట్లీకి కథను లీక్ చేసి ఉంటాడు. నా కథను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం విజయ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు అని తమిళ మీడియా తన కథనాల్లో పేర్కొన్నది. అయితే ఈ ఆరోపణలపై చిత్ర యూనిట్ గానీ, విజయ్ పీఆర్ వర్గాలు గానీ ఇంకా స్పందించలేదు.

    కోర్టును ఆశ్రయించేందుకు దర్శకుడు రెడీ

    కోర్టును ఆశ్రయించేందుకు దర్శకుడు రెడీ

    వర్ధమాన దర్శకుడు కావడం వల్ల శివ ఫిర్యాదును రైటర్స్ అసోసియేషన్ పట్టించుకోవడం లేదు. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే అసోసియేషన్‌లో ఆరు నెలలుగా సభ్యులై ఉండాలి. అప్పుడే ఫిర్యాదుపై స్పందిస్తామని శివకు రైటర్స్ అసోసియేషన్ స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో బాధితుడు శివ కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నట్టు సమాచారం.

     మహిళ ఫుట్‌బాల్ కోచ్‌గా విజయ్

    మహిళ ఫుట్‌బాల్ కోచ్‌గా విజయ్

    విజయ్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందించే ఫుట్ బాల్ క్రీడ ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో విజయ్ తమిళనాడు మహిళల ఫుట్ బాల్ జట్టుకు కోచ్‌గా నటిస్తున్నాడు. మేయాధ మాన్ ఫేం ఇందుజా రవిచంద్రన్ ఫుట్ బాల్ కెప్టెన్‌గా నటిస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతున్నది. ఈవీఎం స్టూడియోలో ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ను సుమారు రూ.6 కోట్లతో సెట్ రూపొందించారు.

    గతంలో కూడా అట్లీపై ఆరోపణలు

    గతంలో కూడా అట్లీపై ఆరోపణలు

    దర్శకుడు అట్లీపై ఆరోపణలు రావడం ఇదే కొత్త కాదు. మెర్సల్ కథ ముండ్రు ముగం అనే సినిమా కథను పోలి ఉందని నిర్మాత కాథిరేసన్ ఆరోపించారు. ఈ ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అలాగే రాజా రాణి, థెరీ సినిమా కథలను కూడా కాపీ కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ సినిమా కథలు మౌనరాగం, సత్రియాన్ కోసం తమ కథలను కాపీ కొట్టారని అట్లీపై కఒందరు విమర్శలు చేశారు.

    English summary
    Aspiring director Shiva has accused director Atlee of plagiarising Thlapathy 63's story from his short film, which is based on a women's football team. Reportedly, Shiva has narrated his story to many leading producers in the industry. He suspects that one of the producers must have leaked the story to Atlee, who developed it into a feature film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X