500 కోట్లతో అట్లీ భారీ ప్లాన్.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూనా?

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తాలూకా స్పాన్ ఏ రేంజ్ లో పెరుగుతూ వెళ్లిపోతుందో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాల్లో క్వాలిటీ కోసం రికార్డు బడ్జెట్ లు కూడా అయితే ఈ బడ్జెట్ లు మాత్రమే కాకుండా కొన్ని ఊహించని కాంబినేషన్ లు కూడా మన దగ్గర వస్తున్నాయి. ఇలా కొన్ని కొన్ని కొలాబరేషన్ లు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు కూడా కలిపి వస్తుండగా ఈ మల్టీస్టారర్ చిత్రాల్లో ఒక సెన్సేషనల్ మల్టీ స్టారర్ సినిమాని తమిళ యువ దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

కాగా తమిళ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో అట్లీ కూడా ఒకరు. తన సినిమాలపై ఎలాంటి కామెంట్స్ ఉన్నప్పటికీ కమర్షియల్ గా ప్రతీ సినిమా కూడా భారీ సక్సెస్ అయ్యింది. ఇలా ఒక్క తమిళ్ నుంచే కాకుండా హిందీలోకి వెళ్లి కూడా అక్కడ 1000 కోట్ల సినిమాని సోలో అందించిన ఘనత కూడా అట్లీ సొంతం చేసుకున్నారు. కాగా అట్లీపై కొన్నాళ్ల నుంచి ఓ క్రేజీ రూమర్ ఉంది.

atlee planning huge with 500 crore from bollywood to hollywood

తాను బాలీవుడ్ సూపర్ స్టార్ ఒకరు, కోలీవుడ్ సూపర్ స్టార్ ఒకరితో కలిసి ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. మరి వారే బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, తమిళ సినిమా నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నట్టు తెలిసింది. కానీ ఈ సినిమాకి బిగ్ ఛేంజ్ చోటు చేసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

వీటి ప్రకారం బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ఉన్నాడు కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఓ హాలీవుడ్ హీరో రీప్లేస్ చేస్తాడు అంటూ షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ హీరో ఎవరో కూడా కాదు స్టార్ నటుడు విల్ స్మిత్ అట. ఐయామ్ లెజెండ్, ఐ రోబోట్, ఎంఐబి, ఆఫ్టర్ ఎర్త్, ఇంకా ఎన్నెన్నో హాలీవుడ్ వండర్స్ లో కనిపించిన ఈ స్టార్ ని అట్లీ తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడట.

అంతే కాకుండా ఈ సినిమాని సుమారు 500 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కించే సన్నాహాలు కూడా చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ప్లాన్ చేస్తుండగా ప్రస్తుతం బడ్జెట్ సహా విల్ స్మిత్ తో కూడా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకే ప్రస్తుతం ఈ బిగ్ మల్టీస్టారర్ హోల్డ్ లో ఉన్నట్టుగా టాక్.

atlee planning huge with 500 crore from bollywood to hollywood

సో ఒకవేళ కానీ ఇది సక్సెస్ అయితే ఇండియన్ సినిమా దగ్గర ఒక నయా హిస్టరీ సెట్ అయ్యినట్టే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా కోసం పక్కన పెడితే అట్లీ, పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక క్విక్ పాన్ ఇండియా సినిమా కూడా చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

ఇది కూడా దాదాపు ఖరారు కాగా అతి త్వరలోనే ఈ సినిమా మొదలు కానుంది అట. వీరి కలయికపై కూడా ఎప్పుడు నుంచో మంచి బజ్, ఎలాగో అట్లీ పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అల్లు అర్జున్ మార్కెట్ కూడా వేరే లెవెల్లో ఉంది సో ఈ సినిమా కూడా రికార్డులు సెట్ చేస్తుంది అని చాలా మంది నమ్ముతున్నారు.

More from Filmibeat

Read more about: atlee jawan salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X