హీరోయిన్‌తో డైరెక్టర్ ఎంగేజ్మెంట్, నయనతార సపోర్ట్ (ఫోటోస్)
చెన్నై: తమిళ దర్శకుడు అత్లీ కుమార్ ఎంగేజ్మెంట్ తమిళ హీరోయిన్ ప్రియతో ఆదివారం(సెప్టెంబర్ 7) ఘనంగా జరింగింది. చెన్నైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హీరోయిన్ నయనతార, హీరో ఆర్య, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ఇటీవల తెలుగులో ‘రాజా రాణి' పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ఈచిత్రంలో ఆర్య-నయనతార జంటగా నటించారు.
మురుగదాస్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన అత్లీ కుమార్ ‘రాజా రాణి' సినిమాతో దర్శకుడిగా మారి తొలి సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. తమిళంలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇక ప్రియా గురించిన వివరాల్లోకి వెళితే టెలివిజన్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. సూర్య హీరోగా వచ్చిన ‘సింగం' చిత్రంలో కూడా నటించింది.
అత్లీ కుమార్, ప్రియా కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇంట్లో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంగేజ్మెంటుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

నయనతార-ఆర్య
అత్లీ కుమార్, ప్రియా ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరైన హీరో ఆర్య, నయనతార

ప్రియా-అత్లీ కుమార్
ఎంగేజ్మెంట్ వేడుకలో ప్రియా, అత్లీ కుమార్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

స్నేహితులు
ప్రియా-అత్లీ కుమార్ ఎంగేజ్మెంట్ సందర్భంగా హాజరైన స్నేహితులు.

రేర్ పిక్చర్స్
పెళ్లికి ముందు నుండే ప్రియా, అత్లీ కుమార్ ప్రేమించుకుంటున్నారు.

ప్రియా
తన స్నేహితులతో కలిసి ప్రియా ఇలా ఫోటోలకు ఫోజలు ఇచ్చింది.


Click it and Unblock the Notifications











