స్టార్ హీరోతో హ్యాట్రిక్ మూవీ.. పవర్ ఫుల్ స్టోరీతో రాబోతున్న యంగ్ డైరెక్టర్!
ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం యంగ్ డైరెక్టర్ అట్లీని చూసి అవాక్కవుతోంది. అద్భుతమైన కథలతో తెరకెక్కించిన మూడు చిత్రాలని ఘానా విజయాలుగా మలిచాడు. అందులో రెండు చిత్రాలు స్టార్ హీరో విజయ్ తోనే ఉండడం విశేషం. తేరి, మెర్సల్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ కోసం సిద్ధం అవుతోంది. ఇటీవల అట్లీ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ విజయ్ తో తెరక్కించే చిత్రం గురించి స్పందించాడు. తేరి, మెర్సల్ కంటే పవర్ ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నా. సినిమా ప్రారంభించడానికి తాను కూడా చాలా ఆసక్తిగా ఉన్నానని అట్లీ తెలిపాడు.

ప్రస్తుతం విజయ్ మురుగదాస్ దర్శత్వంలో సర్కార్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ దీపావళికి సర్కార్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











