మాజీ హీరోయిన్ రంభ ఇంటిపై రాళ్ళతో దాడి
వివాహం చేసుకుని సెటిలైన మాజీ హీరోయిన్ రంభ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి విధ్వంసం సృష్టించారు. వాచ్ మేన్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేసారు. వారు ధర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ...ఇటీవల పెళ్లి చేసుకున్న రంభ తన భర్తతో కలసి కెనడాకు వెళ్లారు. కాగా, స్థానిక సాలిగ్రామంలోని నవనీతమ్మాళ్ వీధిలో ఉంటున్న ఆమె ఇంటిపై తెల్లవారు ఝామున 4.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ట్యూబ్ లైట్లను, ఇంటి బయట ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకోబోయిన వాచ్ మన్ దీన్ డిక్రూజ్ ను కూడా చితగ్గొట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నా మన్నారు.


Click it and Unblock the Notifications











