బంగారం తమిళ రీమేక్‌లో విజయ్
పవన్ కళ్యాణ్- ఎఎం రత్నంల ప్రతిష్టాత్మక సినిమా బంగారం రీమేక్ వెర్షన్‌లో తమిళ హీరో విజయ్ నటించనున్నాడు. స్వతహాగా తమిళుడైన ఎఎం రత్నం ఈ సినిమాను తమిళంలో కూడా నిర్మించకపోవడం గమనార్హం. ఆయన తన డైరెక్ట్ తెలుగు సినిమా బంగారంపై ఎంతగా ఆశలు పెట్టుకున్నారో దీనిని బట్టి అర్ధమవుతోంది. మలయాళంలో చంద్రముఖి ఒరిజినల్ వెర్షన్‌ను నిర్మించిన స్వర్గచిత్ర అపాచన్ విజయ్ హీరోగా తెలుగు బంగారంను తమిళంలో నిర్మించబోతున్నారు. దర్శకుడు ధరణికి ఫ్యాన్ అయిన విజయ్ ఈ రీమేక్‌కు దర్శకుడిని తానే ఎంపిక చేయడం విశేషం. అపాచన్ సూచించిన ఇద్దరు దర్శకులను కాదని విజయ్ ఒకనాటి ధరణి శిష్యుడైన భరతన్‌ను డైరెక్టర్‌గా ఎంపిక చేసుకోవడం అందుకు నిర్మాత అపాచన్ అంగీకరించడం జరిగిపోయాయి. బంగారం నిర్మాత ఎఎం రత్నం నుంచి తమిళ రీమేక్ హక్కులను పెద్ద మొత్తానికి అపాచన్ కొనుగోలు చేసినట్టు తెలిసింది. సాధారణంగా హిట్ అయిన తమిళ సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతుంటాయి. తమిళ సినిమాలు నిర్మాణ దశలో ఉండగా తెలుగు రీమేక్ హక్కులను మన వాళ్ళు కొనుగోలు చేయరు. అది వేరే విషయం. తెలుగు సినిమాలు తమిళంలో రీమేక్ కావడం అరుదు. అటువంటిది ఒక తెలుగు సినిమా విడుదల కాక ముందే దానికి తమిళంలో రీమేక్ హక్కులకు అధిక మొత్తం రావడం విశేషమే. దర్శకుడు ధరణి మీద ఉన్న నమ్మకమే దీనికి కారణమని వేరే చెప్పనవసరం లేదు.


Click it and Unblock the Notifications