రకుల్ అలాంటిదే.. సర్టిఫై చేసిన డైరెక్టర్
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రవర్తన, వ్యవహరించే తీరు గురించి అందరికీ తెలిసిందే. మనసులో ఏదైనా అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తుంటుంది. ఆ మధ్య నెటిజన్ తనపై, తన వస్త్రధారణపై వల్గర్ కామెంట్స్ చేయడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీడియా సైతం పలుమార్లు తప్పుడు వార్తలు రాస్తుండటంపైనా రకుల్ సెటైర్స్ వేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రకుల్.. రూమర్స్‌పై వెంటనే స్పందిస్తుంది. అందులో నిజనిజాలను తన ఫ్యాన్స్‌కు చెబుతుంది. రూమర్స్ క్రియేట్ చేసేవారిపైనా విరుచుకుపడుతుంది. అయితే అది కూడా హాస్యధోరణిలోనే అనుకోండి. తాజాగా రకుల్ ఓ మీడియా సంస్థపై కౌంటర్ వేసింది. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినా కరోనా భయంతో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఓ వెబ్‌సైట్ రకుల్ గురించి ఓ వార్త రాసింది. రకుల్ షూటింగ్‌కు రానని చెబుతోందటా.. అందుకే సినిమాలోంచి తీసేస్తున్నారట అని సదరు వెబ్ సైట్ పేర్కొంది. వీటిపై హీరోయిన్ రకుల్, దర్శకుడు రవికుమార్ స్పందించారు.

రకుల్ స్పందిస్తూ.. ఎప్పుడు మీడియా బాధ్యతతో నడుచుకుంటుంది? ఎప్పుడు నిజనిర్దారణ చేసుకుంటుందని సెటైర్స్ వేసింది. అయితే దర్శకుడు రవికుమార్ స్పందిస్తూ.. రకుల్ గురించి చెప్పుకొచ్చాడు. తాను పని చేసిన వారిలో మోస్ట్ ఫ్రొఫెషనల్ ఆర్టిస్ట్ రకుల్ ప్రతీ సింగ్ అని కితాబిచ్చాడు. మీడియా ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం మా దురదృష్టమని పేర్కొన్నాడు. మా చిత్రయూనిట్ మొత్తం ఎంతో స్పిరిట్‌తో ఉన్నామని, అంతా సద్దుమణిగి, షూటింగ్ మళ్లీ మొదలుపెట్టాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చాడు. శివ కార్తికేయన్ హీరోగా వస్తోన్న అయ్లాన్ సినిమా సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఇప్పటికే మెజార్టీ పార్ట్ షూటింగ్ పూర్తయింది.


Click it and Unblock the Notifications











