పవర్‌ఫుల్ యాక్షన్... ‘టెంపర్’ చూపించిన విశాల్ (టీజర్)
జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ 'టెంపర్' సంచలన విజయం సాధించడంతో దీన్ని ఇతర బాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. హిందీలో రణవీర్ సింగ్ హీరోగా 'సింబా' పేరుతో రీమేక్ చేయగా సూపర్ హిట్ అయింది. తమిళ రీమేక్‌లో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. 'అయోగ్య' పేరుతో రూపొందిన ఈ మూవీ టీజర్ బుధవారం విడుదలైంది.
టీజర్లో విశాల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. తన పవర్‌ఫుల్ యాక్షన్‌తో టెంపర్ చూపించాడు. విశాల్‌కు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. వెంకట్ మోహన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

టీజర్ చూస్తుంటే తెలుగు వెర్షన్ స్టోరీలో పెద్దగా మార్పులు చేయకుండానే... దాదాపు అవే సీన్లతో రూపొందించినట్లు స్పష్టమవుతోంది. విలన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు పార్తీబన్ నటిస్తున్నారు. విశాల్-పార్తీబన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.
'అయోగ్య' అంటే యోగ్యత లేనివాడు అని అర్థం. హీరో క్యారెక్టరైజేషన్‌కు పెర్ఫెక్టుగా సూటయ్యే విధంగా ఉండటంతో తమిళ వెర్షన్‌కు ఈ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో సన్నీ లియోన్ ఐటం సాంగులో కనిపించబతోంది.


Click it and Unblock the Notifications











