టెంపర్ రీమేక్‌కి సన్నీలియోన్ షాక్.. ఆ హీరోయిన్‌కి లక్కీ ఛాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం పలు భాషల్లో రీమేక్ అవుతోంది. ఇప్పటికే హిందీలో సింబా పేరుతో రీమేక్ అయింది. రణవీర్ సింగ్ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ విషయంలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

క్రేజీ గా మారిన సన్నీలియోన్
శృంగార తారగా గుర్తింపు పొందిన సన్నీలియోన్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఐటెం సాంగ్స్, గ్లామర్ రోల్స్ చేస్తూ క్రేజీ స్టార్ గా మారిపోయింది. ఆ తర్వాత సన్నీలియోన్ క్రేజ్ దక్షణాది చిత్రాలకు కూడా వ్యాపించింది. గరుడవేగ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సన్నీలియోన్ ప్రస్తుతం తమిళంలో వీరమాదేవి అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తోంది.

టెంపర్ రీమేక్‌కి షాక్
పూరి జగన్నాధ్ తెరకెక్కించిన టెంపర్ చిత్రంలో ఐటమ్ సాంగ్ సూపర్ అయింది. మాస్ ఆడియన్స్ టెంపర్ చిత్రంలోని ఐటెం సాంగ్ ని బాగా ఎంజాయ్ చేశారు. విశాల్ అయోగ్య చిత్రంలో కూడా అదే తరహాలో స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ముందునుంచి సన్నీలియోన్ పేరు వినిపిస్తోంది. కానీ అయోగ్య యూనిట్ కి సన్నీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో సన్నీలియోన్ ని తీసుకునే ఆలోచనని అయోగ్య యూనిట్ విరమించుకుంది.

శ్రద్దా దాస్
సన్నీ లియోన్ ని తప్పించడంతో శ్రద్దా దాస్ కు బాగా కలిసొచ్చింది. అయోగ్య చిత్రంలోని ఐటెం సాంగ్ కోసం శ్రద్దా దాస్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది. అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలోని 'బ్లాక్ బస్టర్' సాంగ్ ని రీమిక్స్ చేసి అయోగ్యలో ఉపయోగించబోతున్నారు. ఈ సాంగ్ లోనే శ్రద్దా దాస్ స్టెప్పులేయబోతోంది. శ్రద్దా దాస్ కు హాట్ హీరోయిన్ గా యువతలో గుర్తింపు ఉంది,. పైగా తక్కువ రెమ్యునరేషన్ కావడంతో సన్నీ లియోన్ కంటే ఈమే బెటర్ అని అయోగ్య చిత్ర యూనిట్ భావించిందట.

రాశి ఖన్నా
వెంకట్ మోహన్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశాల్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు వెంకట్ మోహన్ తమిళ నేటివిటీకి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. విక్రమ్ వేద ఫేమ్ శామ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











