twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్రేట్ థాట్: సినిమాకు తెగే ప్రతి టిక్కెట్ మీద రైతులకు సాయం

    |

    తమిళనాడులో విశాల్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మాత్రమే కాదు..సేవా కార్యక్రమాలు చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. విశాల్ తాజా చిత్రం 'అయోగ్య' గతవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుని సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతున్న నేపథ్యంలో రైతుల కోసం డొనేషన్ ప్రకటించారు.

    'అయోగ్య' సినిమా ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయి తమిళనాడు రైతుల కోసం విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు ఎన్ని టికెట్లు అమ్ముడయితే అన్ని రూపాయలు విరాళంగా వెళ్లనున్నాయి. విశాల్ నిర్వహించే దేవి ట్రస్ట్ ద్వారా ఈ డబ్బును రైతుల కోసం ఉపయోగించనున్నారు.

    Ayogya: Vishal announced donation to Tamil Nadu farmers

    అయితే ఈ డబ్బు నిర్మాత నుంచి ఇప్పించడం లేదని... తన సొంత డబ్బుతో విశాల్ ఈ మంచి కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. తన గత సినిమా విషయంలోనూ విశాల్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 'తుప్పరివాలన్' సినిమా సమయంలో విశాల్ తొలిసారి ఈ ప్రకటన చేశారు. 'పందెంకోడి 2' సినిమా నుంచి దీన్ని కొనసాగిస్తున్నారు.

    ఇచ్చిన మాట ప్రకారం 'పందెంకోడి 2' సినిమాకు అమ్మడైన టిక్కెట్ల లెక్కమేరకు... రూ. 10 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. ఇపుడు 'అయోగ్య' సినిమాకు సైతం దాన్ని కొనసాగిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ఎన్ని టికెట్లు అమ్ముడవుతాయో? విశాల్ ఎంత విరాళం ఇవ్వబోతున్నాడో? త్వరలో క్లారిటీ రానుంది.

    'అయోగ్య' విషయానికొస్తే... తెలుగు సూపర్ హిట్ 'టెంపర్' చిత్రానికి ఇది రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించగా పార్తీబన్, కెఎస్ రవికుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది.

    English summary
    Vishal has announced that he would be donating rupees one from every ticket sold for 'Ayogya' to the Tamil Nadu farmers. Ayogya directed by debutant Venkat Mohan. The film is a remake of the 2015 Telugu film Temper. It was produced by B. Madhu through his company Light House Movie Makers. The film stars Vishal and Raashi Khanna in the lead roles, while R. Parthiban, K. S. Ravikumar, Sachu, Vamsi Krishna, and Pooja Devariya appears in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X