»   »  ‘బాహుబలి-2' లో చేయటం లేదంటూ ఖండన

‘బాహుబలి-2' లో చేయటం లేదంటూ ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడీ చిత్రం సెంకండ్ పార్ట్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో తమిళ స్టార్ హీరో సూర్య ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు మీడియాలో గుప్పు మన్నాయి. కానీ ఈ విషయమై సూర్య తమిళ మీడియా వద్ద ఖండించారు.

సూర్య మాట్లాడుతూ..."ఇప్పటివరకూ నేను బాహుబలి 2 లో చేయటం లేదు. నేను ఆ సినిమాలో ఏ పాత్ర కోసం సైన్ చేయలేదు. అవి కేవలం రూమర్స్ మాత్రమే. అలాగే రాజమౌళి గానీ, నేను కానీ ఈ విషయమై మాట్లాడుకోలేదు.. ", అని అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Baahubali 2? No I've not signed -Surya

ఇక రుద్రమదేవి చిత్ర అఖండ విజయంతో ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వుంది అనుష్క. ఈ సినిమాలో ఆమె అసమాన అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. బాహుబలి రుద్రమదేవి చిత్రాలతో ఈ ఏడాది చిరస్మరణీయమైన విజయాల్ని సొంతం చేసుకున్న ఈ సుందరి ప్రస్తుతం బాహుబలి-2 చిత్రీకరణ కోసం సిద్ధమవుతోంది. తాను పోషించే పాత్రల్లో పరిపూర్ణత కోసం అనుక్షణం తపించే ఈ వయ్యారి బాహుబలి-2 కోసం మరో ఛాలెంజ్‌కు సిద్ధపడుతోంది. వివరాల్లోకి వెళితే..సైజ్‌జీరో చిత్రం కోసం అనుష్క దాదాపు 20కిలోల బరువు పెరిగిన విషయం తెలిసిందే.

త్వరలో ప్రారంభంకాబోతున్న బాహుబలి-2 చిత్రంలో యువరాణి దేవసేన పాత్రలో చక్కటి శరీరసౌష్టవంతో కనిపించాల్సిరావడంతో తక్కువ సమయంలో వీలైనంత బరువు తగ్గాలనే నిర్ణయానికి వచ్చిందట అనుష్క. అందుకోసం అనుష్క అమెరికా వెళ్లబోతుందని, అక్కడ ప్రత్యేక శిక్షకుడి సహాయంతో వెయిట్‌లాస్ థెరపీ చేయించుకోనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బాహుబలి-2 చిత్ర బృందంతో దర్శకుడు రాజమౌళి సమావేశమయ్యారని, సినిమా తాలూకు వివిధ అంశాలపై చర్చలు జరిపాడని తెలిసింది. వచ్చేనెలలో బాహుబలి-2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది.

English summary
"For now, I'm not part of Baahubali 2. I've not signed any such role in the magnum opus. There is no truth in those rumours. Neither Rajamouli approached me, Nor I've approached him", Tamil superstar Surya said.
Please Wait while comments are loading...