Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రముఖ దర్శకుడిని పట్టేసిన అనుష్క శెట్టి.. నయనతార, కీర్తీ సురేష్‌కు ఝలక్
నవాబ్ చిత్రం అందించిన విజయోత్సహంతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరో చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న నవల పొన్నియన్ సెల్వన్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త మీడియాలో వైరల్ అయింది.
ఇటీవల కాలంలో ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా స్వయంగా ఐశ్వర్య తాను మణిరత్నం సినిమాలో నటిస్తున్నట్టు స్పష్టం చేశారు. తన గురువు సినిమాలో నటించడం కంటే ఇంకా కావాలి అనే మాటను ఆమె వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం అనుష్క శెట్టిని తీసుకొన్నట్టు మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే అనుష్క సినిమాను అంగీకరించిందా అనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

అయితే తమిళ మీడియా రిపోర్టుల ప్రకారం.. మణిరత్నం చిత్రంలో అనుష్క నటించేందుకు అంగీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన ఒప్పందాలపై త్వరలో సంతకాలు చేస్తారు అని పేర్కొన్నాయి. గతంలో ఈ పాత్ర కోసం నయనతార, కీర్తి సురేష్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇరు వర్గాల నుంచి బయటకు రాలేదు.

అనుష్కకు సంబంధించిన ప్రస్తుతం అమెరికాలో సైలెన్స్ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నది. నెల రోజులకుపైగా సాగే ఈ సినిమా షూట్‌లో ఆమె పాల్గొంటారు. ఈ చిత్రంలో కిల్ బిల్ యాక్టర్ కూడా నటిస్తున్నారు. అలాగే అంజలి, మాధవన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
పొన్నియన్ సెల్వం చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, సత్యరాజ్, మోహన్ బాబు, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అమలాపాల్ తదితరులు నటిస్తున్నారు.