»   » 'బాహుబలి' తమిళ కలెక్షన్స్ పరిస్దితి

'బాహుబలి' తమిళ కలెక్షన్స్ పరిస్దితి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తెలుగులో ఇప్పటికే బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ 'బాహుబలి' ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అదే రోజున తమిళ, హిందీలలో కూడా విడుదలైంది. మరి అక్కడ కలెక్షన్స్ పరిస్ధితి ఎలా ఉందనే ఆసక్తి కలగటం సహజం. అందుకే ఆ వివరాలు ఇస్తున్నాం..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తమిళం ట్రేడ్ వర్గాల సమాచారాన్ని బట్టి అక్కడ కూడా అద్బుతమైన కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. మొదటి మూడు రోజుల్లో 17 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన బాహుబలి నాల్గవ రోజుతో సుమారు 20 కోట్ల మార్క్ ని టచ్ చేసిందని చెప్తున్నారు. ముఖ్యంగా వీక్ ఎండ్ లలో కూడా స్ట్రాంగ్ రన్ ఉందని చెబుతున్నారు.


ఇక ఈ చిత్రాన్ని తమిళంలో అందించిన తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా బాహుబలి కలెక్షన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. బాహుబలి తమిళ్ లో 40 కోట్ల క్రాస్ చేస్తుంది అని అన్నారు.


'Baahubali' Rocks at TN Collection Centres

ఇక దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనకు అండగా నిలిచిన ట్విట్టర్‌ స్నేహితులకు, సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 10న విడుదలై భారత సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన 'బాహుబలి' చిత్రాన్ని ఉద్దేశించి ఆయన తన ట్విట్టర్‌లో స్పందించారు.


చిత్రం నిర్మాణంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. అందరి నుంచి ఇంతటి ఆదరణ లభిస్తుందనుకోలేదని అన్నారు. చిత్ర బృందం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్‌ చేశారు.


తెలుగులో కలెక్షన్స్ విషయానికి వస్తే... తొలి రెండు రోజుల్లోనే వసూళ్లు రూ. 100 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 135 కోట్లు రాబట్టినట్టు సమాచారం. తొలిరోజు కలెక్షన్ రూ.68.5 కోట్ల నుంచి రూ.76 కోట్ల మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది వచ్చిన షారూఖ్ ఖాన్ మూవీ 'హ్యాపీ న్యూ ఇయర్' వసూలు చేసిన రూ. 45 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్ ను 'బాహుబలి' అధిగమించాడు.


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ రూ. 30 కోట్లకు పైగా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో రెండు రోజుల్లో రూ.10.25 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ లోనూ 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 10.50 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఓవర్ సీస్ మార్కెట్ లోనూ 'బాహుబలి' రికార్డు బద్దలు కొడుతున్నాడు. అమెరికాలో సుమారు రూ. 11 కోట్లు, ఆస్ట్రేలియాలో దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక మూడు రోజుల వసూళ్లు రూ. 150 కోట్లుకు చేరినట్టు తెలుస్తోంది.

English summary
SS Rajamouli directorial "Baahubali" (also spelt "Bahubali") has got outstanding opening at Tamil Nadu box office. The film has grossed ₹10.25 crore in the state in two days (Friday & Saturday).
Please Wait while comments are loading...