Coolie రజినీకాంత్ కూలీలో బాహుబలి స్టార్... 38 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే విపరీతమైన బజ్ ఏర్పడింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇప్పుడు బాహుబలి స్టార్ కూడా చేరబోతున్నాడు అనే వార్త సంచలనంగా మారింది. మరి ఇంతకీ కూలీ టీంలో యాడ్ కాబోతున్న ఆ బాహుబలి స్టార్ ఎవరు అనే విషయంపై లుక్కేద్దాం పదండి.
రజినీకాంత్ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ మూవీ గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ ని చూశాక లోకేష్ రజినీకాంత్ ను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నాడని ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో రజినీకాంత్ తో పాటు బాహుబలి సినిమాలో కట్టప్ప గా నటించి అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే సత్యరాజ్ కూలి తారాగణంలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాలో ఆయన రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిజానికి సూపర్ స్టార్ రజినీకాంత్, సత్యరాజ్ కలిసి నటించి దాదాపు 38 ఏళ్లు అయిపోతుంది. ఇన్నేళ్ల తర్వాత ఈ సెలబ్రిటీలు ఇద్దరు కలిసి నటించబోతున్నారు అనే వార్త ఇటు రజిని, అటు సత్యరాజ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.
1987లో దిగ్గజ దర్శకుడు కే బాలచందర్ రూపొందించిన మనతిల్ ఉరుధి వేండుమ్ అనే డ్రామాలో రజనీకాంత్, సత్యరాజ్ చివరిసారిగా కలిసి నటించారు. అలాగే ఈ సినిమాలో శృతి హాసన్ రజినీకాంత్ కూతురి పాత్రను పోషిస్తోందని రూమర్లు ఉన్నాయి. కానీ దీని గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

కాగా రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ లో భాగం కాదు. ఈ మూవీని తన యూనివర్స్ నుంచి సపరేట్ గా తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఇక ఇందులో రజనీకాంత్ విభిన్నమైన మాస్ అవతారంలో కనిపించబోతున్నాడని, రజనీకాంత్ కెరీర్ లోనే ఇప్పటి వరకు చేయని విధంగా ఇదొక అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కాబోతోందని టాక్ నడుస్తోంది.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కూలీ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే రజినీకాంత్ తన నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వెట్టాయన్ చివరి షెడ్యూల్ ను పూర్తి చేయడంతో త్వరలోనే కూలీ షూటింగ్ ప్రారంభం కాబోతుందని టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











