రజనీకాంత్ టాప్ ప్రొడ్యూసర్ కన్నుమూత.. సౌత్ సినిమాలో మరో విషాదం

సినీ రంగంలో దుర్ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా ఉన్న పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ఎంతో మంది హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు మరణించారు. ముఖ్యంగా గత వారంలోనే ప్రముఖ నటుడు డానియెల్ బాలాజీ, రైటర్ శ్రీ రామకృష్ణ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మరువక ముందే ఇప్పుడు సినీ రంగంలో మరో విషాదం జరిగింది. సుదీర్ఘ కాలంగా సినిమా నిర్మాత సేవలు అందించిన ఆర్ఎం వీరప్పన్ (98) తాజాగా మరణించారు. దీంతో దక్షిణాదిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ప్రముఖ నిర్మాత, MGR కజగం పార్టీ వ్యవస్థాపకుడు ఆర్ఎం వీరప్పన్ వయసు మీద పడడంతో కొంత కాలంగా వృద్దాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలా చాలా రోజులుగా ఆయన మంచానికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవలే వీరప్పన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

Baashha Producer R M Veerappan Passes Away Due to Health Issues

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోన్న సమయంలోనే అంటే మంగళవారం ఆర్ఎం వీరప్పన్ పరిస్థితి విషమించింది. దీంతో వైద్యులు ఆయనను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఈ సీనియర్ ప్రొడ్యూసర్ ఆస్పత్రిలోనే తుది శ్వాసను విడిచారు. ఆర్ఎం వీరప్పన్ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

ఆర్ఎం వీరప్పన్ 1964లో ఎంజీఆర్ హీరోగా నటించిన 'దైవ తాయి' అనే సినిమాతో రైటర్‌గా, నిర్మాతగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో సినిమాలకు రచయితగానూ, నిర్మాతగానూ వ్యవహరించారు. ముఖ్యంగా రజినీకాంత్‌ను సూపర్‌ స్టార్‌గా మార్చిన 'బాషా' చిత్రాన్ని కూడా ఆర్ఎం వీరప్పనే నిర్మించారు. అలాగే, కమల్ హాసన్‌తో సైతం ఎన్నో చిత్రాలను తీశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంత్రిగానూ పని చేశారు.

ఇదిలా ఉండగా.. ఆర్ఎం వీరప్పన్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక, ఆయన అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి తమిళనాడుకు చెందిన ఎంతో మంది నటీనటులు, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X