24 ఏళ్ల యువతితో వివాహం.. సీనియర్ హీరో క్లారిటీ.. పెళ్లికి ఒప్పుకోలేదంటూ
సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో వివాహాలు, విడాకులు, లవ్ ట్రాక్ లు, బ్రేకప్ లు సర్వసాధారణం. ఆలాగే మొదటి పెళ్లిని విడిచి రెండో వివాహం చేసుకోవడం చాలా కామన్ గా మారిన విషయమే. ఈ నేపథ్యంలో పెళ్లి సినిమా ఫేమ్ బబ్లూ పృథ్వీరాజ్ ఇటీవల 23 ఏళ్ల మలేషియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతను అలా వివాహం చేసుకోవడంపై అనేకమంది విమర్శలు చేశారు. కొంతమంది సపోర్టింగ్ గా నిలిచారు. తాజాగా ఈ వార్తలపై బబ్లూ పృథ్వీరాజ్ స్పందించారు. తను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సిందో.. ఆమె ఎవరో అని తదితర ఆసక్తికర విషయాలను మీడియా ద్వారా తెలిపారు.

తన కంటే చాలా ఏళ్లు చిన్నదైన యవతితో..
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన బబ్లూ పృథ్వీరాజ్ మర్మదేశం, వాణి రాణి, రమణి వర్సెస్ రమణి, అరాసీ తదితర సీరియల్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే వడ్డే నవీన్ హీరోగా నటించిన పెళ్లి సినిమాతో తెలుగులో సూపర్ పాపులర్ అయ్యారు. నువ్ నాకు నచ్చావ్, గౌతమ్ ఎస్ఎస్ సీ వంటి తదితర చిత్రాల్లో కూడా అప్పుడప్పుడు అలరించారు. ఇదిలా ఉంటే ఇదివరకే బీనా అనే యువతిని 30 ఏళ్ల క్రితం వివాహమాడాడు పృథ్వీరాజ్. వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ తన కంటే 34 ఏళ్ల (23 ఏళ్లు) చిన్నదైన మలేషియా అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మాకు ఇంకా పెళ్లి కాలేదు..
బబ్లూ పృథ్వీరాజ్ రెండో పెళ్లిపై అనేక వార్తలు రావడంతో వాటిపై క్లారిటీ ఇచ్చేందుకు ఇటీవల తమిళ మీడియా ద్వారా తెలిపారు. ''నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 23 కాదు 24 ఏళ్లు. అంతేకాదు ఆమె మలేషియాకు చెందిన యువతి కాదు. తెలుగు అమ్మాయే. ఆమె పేరు శీతల్. ఆమె నాతో పెళ్లికి రెడీగా ఉంది. నిజానికి మొదట నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆలోచించుకోమని చాలా సమయం ఇచ్చాను. అయినా, శీతల్ నన్ను వివాహం చేసుకుంటానని చెప్పింది. అందుకు ఆమె కుటుంబం కూడా ఒప్పుకుంది. ఇంకా మాకు పెళ్లి కాలేదు. ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నాం. అయినా ప్రేమకు, వయసుతో సంబంధం ఏంటి.. ఎవరు.. ఏ సమయంలో ప్రేమలో పడతారో ఎవ్వరూ చెప్పలేరు'' అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.

నెలకు ఒకసారి కలుస్తాను..
పెళ్లి సినిమాతో మోస్ట్ పాపులర్ అయిన పృథ్వీరాజ్.. తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు. సుమారు 40 తెలుగు సినిమాల్లో నటించారు. అలాగే సీరియల్స్ కూడా చాలానే చేశారు. 1994లో బీనా అనే అమ్మాయిని ప్రేమించి వివాహామాడారు పృథ్వీరాజ్. ఈ జంటకు 27 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యతో గొడవల కారణంగా ఆమెకు దూరంగా ఉంటున్నారట పృథ్వీరాజ్. తన కొడుకుని మాత్రం నెలకు ఒకసారి కలుస్తానని తెలిపారు. భార్యకు దూరంగా ఉంటున్న ఆయన 24 ఏళ్ల తెలుగు యువతి శీతల్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు మీడియాలో చెప్పారు. పృథ్వీరాజ్ ఇచ్చిన క్లారిటీతో ఈ టాపిక్ సద్దుమణుగుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











