'.... రాంబాబు' కి తమిళనాడులో చుక్కెదురు
చెన్నై: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. ప్రపంచవ్యాప్తంగా భారీ స్ధాయిలో విడుదల అవుతున్న ఈ చిత్రం తమిళనాడులో చాలా తక్కువ ధియోటర్స్ లో రిలీజ్ అవుతోంది. గబ్బర్ సింగ్ చిత్రం 42 ధియోటర్స్ లో విడుదల అయితే ఈ చిత్రం కేవలం 22 స్రీన్స్ లో మాత్రమే విడుదల అవుతోంది. దానికి కారణం ధియోటర్స్ కొరత అని తెలుస్తోంది. సూర్య మాట్రాన్(బ్రదర్శ్) ఎక్కువ దియోటర్స్ లో విడుదల అవటం, అవి ఇంకా కంటిన్యూ అవటం ఓ కారణమైతే, ఈ వారం మరికొన్ని స్టైయిట్ తమిళ సినిమాలు విడుదల అవటం మరో కారణం. దీనికి తోడు రెండు ఇంగ్లీష్ రిలీజ్ లు,మరో రెండు హిందీ సినిమా రిలీజ్ లు,మళయాళం చిత్రాలు ఈ వారం చెన్నైలో విడుదల అవుతున్నాయి.
తమిళనాడులో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ని అబిరామి మెగా మాల్ వారు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. వారే చెన్నైలో మాట్లాన్ ని విడుదల చేస్తున్నారు. వారు చాలా ట్రై చేసినా ఈ చిత్రానికి ఇంతకు మించి ధియేటర్స్ కేటాయించలేకపోయామంటున్నారు. ఇక తమిళ రైట్స్ 52 లక్షలకు అమ్ముడు పోయాయి. అవి ఎలాగైనా ఓ వారంలో రికవరి అవుతాయి,మిగతాది లాభమే అని వారు అంచనాలు వేసుకుంటున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే రెండో వారం నుంచి ధియోటర్స్ పెంచే అవకాశముందంటున్నారు.
''ఓ జర్నలిస్ట్‌కీ, ఓ రాజకీయనాయకునికీ మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యను రాంబాబు ఎలా పారద్రోలాడు అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం.. చాలా సీరియస్ మోడ్‌లో సినిమా నడుస్తుంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్. మీడియాపై జోక్స్ ఉన్నా అవి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉండవు'' అని చెప్పారు పూరి జగన్నాథ్.
'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్ సినిమా అంటే అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఆ అంచనాలకు మించిన రేంజ్‌లో ఉంటుందీ సినిమా. తొలిప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్ చిత్రాలను నైజాం ప్రాంతానికి విడుదల చేసిన తానే.. 'కెమెరామెన్ గంగతో రాంబాబు'ను కూడా విడుదల చేస్తున్నాను '' అని దిల్ రాజు చెప్పారు. ఇక 'కెమెరామెన్ గంగతో రాంబాబు' లో గాబ్రియేలా ఓ గీతంలో నర్తించింది. అది సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు.


Click it and Unblock the Notifications











