అల్లు అర్జున్ బద్రీనాధ్ తమిళ వెర్షన్ విడుదల ఆగినట్లే

By Srikanya

అల్లు అర్జున్,వి వి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందిన బద్రీనాధ్ చిత్రం ఈ నెల పదవ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ,మళయాళ బాషల్లో ఒకేసారి విడుదల చేయాలని సన్నాహాలు చేసారు.అయితే ఈ వారం తమిళంలో మరికొన్ని పెద్ద రిలీజ్ సినిమాలు ఉండటంతో ఈ సినిమాని వాయిదా వేస్తున్నారు.ముందనుకున్నట్లుగా మళయాళ.,తెలుగు వెర్షన్స్ మాత్రం విడుదల అయిపోతాయి.ఇక నిర్మాత అల్లు అరవింద్ టార్గెట్ కూడా ఈ రెండు మార్కెట్లే కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అందులోనూ ఈ మధ్యన తమ బ్యానర్ పై విడుదల చేసిన మగధీర తమిళ వెర్షన్ పెద్దగా వర్కవుట్ కాలేదు.ఈ సినిమా ఓ రేంజిలో హిట్టవుతుందని చాలా అంచనాలుతో ఉన్నారు.అయితే తమిల ఆడియన్స్ ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు.దాంతో తెలుగు,మళయాళ భాషల్లో ఆల్రెడీ మార్కెట్ అల్లు అర్జున్ కి ఉంది కాబట్టి హిట్టవుతుందని,అది చూపెట్టి తమిళంలో ఈ సినిమాని రిలీజ్ చేయవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X