టీవీల్లో చూపితే తప్పులేదా..సినిమాల్లో ఘోరమా?:దర్శకుడు బాల
శివపుత్రుడు వంటి అద్బుత చిత్రాన్ని తీసిన బాల డబల్ స్టాండర్డ్స్ సెన్సార్ షిప్ పై మండిపడుతున్నాడు. తాను తీసిన నాన్ కడవల్ (నేనే దేముడ్ని) చిత్రం సెన్సార్ లో ఇరుక్కుపోవటాన్ని ప్రస్తావిస్తున్నాడు.సినిమా రిలీజైన ఇంతకాలానికి ఆ ప్రసక్తి రావటానికి కారణం ఉంది. ఓ టీవీ ఛానెల్ వారు కాశీలోని అఘోరాల జీవితంపై పోగ్రాం చేసారు. వారు మనుషుల శవాలని తింటారని చూపించారు. ఆ పోగ్రాం బాగా పాపులర్ అయింది. అది చూసిన బాల తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తుతున్నాడు. తాను అవే సీన్స్ తెరపై చూపితే సెన్సార్ వారు కట్ చేసారని, అయితే పాపులర్ టీవీల్లో వాటిని చూపటం ఎంత వరకూ సమంజసం అంటున్నాడు. ఇక తన సినిమా ప్రొమోలు,పోస్టర్స్ చూసి ఫిక్స్ అయిన వారే వచ్చి చూస్తారని, అదే ఛానెల్ లో అయితే చిన్నా పెద్దా అనే తేడాలేకుండా చూస్తారని వివరిస్తున్నాడు. తను తీస్తే తప్పు అయింది..ఛానెల్ లో చూపితే తప్పు ఎందుకు కాదు అని ప్రశ్న వేస్తున్నాడు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించాల్సిన పని ఉందని చెప్తున్నాడు. కరెక్టే కదా.


Click it and Unblock the Notifications











