బాలా దర్శకత్వంలో నెక్ట్స్ ఆ హీరోనే...

'నాడోడిగల్', 'పొరాలి', 'సుందరపాండియన్', 'కుట్టిపులి' ద్వారా కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శశికుమార్ త్వరలోనే భిన్నమైన పాత్రతో అదరగొట్టనున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ రామేశ్వరంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 'పరదేశి' మాదిరిగానే చిత్రీకరణ పూర్తయ్యాక సినిమా విశేషాలను వెల్లడించనున్నట్లు వినికిడి.
హీరోకి తెరపై తిరుగులేని గుర్తింపు ఇస్తాడని దర్శకుడు బాలాకు పేరు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. సూర్య, విక్రం.. వంటి వారికి అలా మంచి సినీ జీవితాన్ని ప్రసాదించాడీ విలక్షణ దర్శకుడు. ప్రతిఒక్కరిలో అసలైన నటుణ్ని వెలికితీసే సత్తా ఆయనలో ఉంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం శశికుమార్‌ను వరించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
'పరదేశి'తో మరో వాస్తవిక దృశ్యకావ్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలా. తర్వాత విక్రంతో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని 'ఐ'లో విక్రం నటిస్తున్నాడు. ఇదికాకుండా మరో రెండు సినిమాలకు కూడా పచ్చజెండా ఊపాడు. శంకర్ సినిమా తర్వాత.. బాలా దర్శకత్వంలో విక్రం మళ్లీ నటించనున్నాడనే వార్తలు ఆమధ్య వినిపించాయి. ఇది కుదరకపోవడంతో ఈ అవకాశం శశికుమార్‌ను వరించింది.


Click it and Unblock the Notifications











