'అపరిచితుడు' విక్రమ్ అభిమానులకు శుభవార్త
జాతీయ ఉత్తమ దర్శకుడు బాల, విక్రమ్ కాంబినేషన్ లో మరో భారీ చిత్రం రూపొం దనున్నట్లు సమాచారం. సేతు(తెలుగులో శేషు) చిత్రంతో బాల విక్రమ్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టారు. ఆ తర్వాత పితామగన్(శివపుత్రుడు) చిత్రంతో విక్రమ్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకునేలా చేశారు. దాంతో చాలా గ్యాప్ తర్వాత వీరి కాంబినేషన్ లో రూపొందనున్న ఈ భారీ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడనుంది. అలాగే ఇప్పటికే విక్రమ్ సినిమాకు కథను సిద్ధం చేసి, వినిపించినట్లు సమాచారం. బాల శిష్యులు ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తానని విక్రమ్ కు బాల మాట కూడా ఇచ్చారు. ఇక నాన్ కడవుల్ (నేనే దేముడ్ని) చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్న బాల ప్రస్తుతం విశాల్, ఆర్యతో అవన్ ఇవన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక బాల దర్సకత్వంలో విక్రమ్ చిత్రం అనగానే ఎక్కడెక్కడ నుంచో విక్రమ్ కు శుభాకాంక్షలు అందుతున్నాయట.


Click it and Unblock the Notifications











