ఆ 'అందమైన అనుభవం' హిందీ వారికీ ....

By Staff
K Balachandar
'కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు', 'అందమైన లోకముంది', 'హల్లో నేస్తం బాగున్నావా', 'నువ్వే నువ్వమ్మా', 'శంభో శివశంభో' వంటి పాపులర్ పాటలతో ఆ తరాన్ని ఉర్రూతలూగించిన చిత్రం అందమైన అనుభవం. కమలహాసన్, జయప్రద, రజనీకాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా 1979లో వచ్చి చక్కని మ్యూజికల్ హిట్టుగా నిలిచింది.ప్రఖ్యాత దర్శకుడు కె బాలచందర్ రూపొందించిన ఈ సినిమా త్వరలో హిందీలో రీమేక్ కానున్నది. నిజానికి ఆ సినిమా వచ్చిన 29 యేళ్లకు హిందీలో రీమేక్ కానుండటం విశేషమే. బాలచందరే స్వయంగా తమ కవితాలయ ప్రొడక్షన్స్ బానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేయబోవడం లేదు. ఆ అవకాశాన్ని యువ తమిళ దర్శకుడు ఉదయభాను మహేశ్వరన్‌కు ఇచ్చారు. అప్పటి 'అందమైన అనుభవం'లో హీరో హీరోయిన్‌లుగా కమల్, జయప్రద నటించగా, రజనీకాంత్ రెండవ హీరోగా నటించారు. ఇప్పుడు ఆ పాత్రలకు సరిపోయే హిందీ నటులను బాలచందర్ అన్వేషిస్తున్నారు. ఆ అన్వేషణ పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ మొదలవుతుంది. వాస్తవానికి ఆ సినిమా సూపర్ హిట్టులో మేజర్ షేర్ పాటలు. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే వున్నాయి. ఈ సందర్భంలో కథనైతే అనువదించి తెరకెక్కించగలరు గానీ ఆ మ్యూజిక్ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యగలరా అని అభిమానులు,విష్లేషకులు అంటున్నారు.ఆలోచించాల్సిందే....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X