మంచి సినిమా అంటే..?: బాలుమహేంద్ర వివరణ

ఇందుకు సమాధానం చెప్పేందుకు ఒకరోజు సమయం కావాలని బాలుమహేంద్ర చెప్పారు. మరుసటిరోజు ఆ శిష్యుణ్ని పిలిచి.. 'మంచి సినిమా అంటే అమ్మచేతి వంటకంలాంటిది. బయట పంచభక్ష్య పరమాన్నం లభించినా అమ్మచేతి వంటకానికి సాటిరాదు. కొన్ని సందర్భాల్లో బయటి తిండి అమ్మ వంటకాన్ని మరిపించొచ్చు. రుచి, ప్రేమానురాగాలు, ఆత్మీయతతోపాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా అమ్మ వంటకంలో ఉంటుంది! మంచి సినిమా కూడా అలాంటిదే'నంటూ జవాబిచ్చారు బాలుమహేంద్ర.
హృదయ్ హీరోగా నటిస్తున్న 'పనివిళుం నిలవు' ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలుమహేంద్ర ఈ అనుభవాన్ని చెప్పారు. కౌశిక్ దర్శకత్వంలోని ఈ చిత్రానికి ఎల్‌వీ గణేశన్ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విక్రమన్, నిర్మాత కేఆర్, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











