twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి సినిమా అంటే..?: బాలుమహేంద్ర వివరణ

    By Srikanya
    |

    Balumahendra
    చెన్నై : మంచి సినిమాలు తీయండి...మంచి సినిమాలు తప్పకుండా జనం ఆదరిస్తారు.. మంచి సినిమా జీవితానికి మార్గదర్శి... ఇలా ప్రతిసారీ సినీప్రముఖులు చెబుతూనే ఉంటారు. ఇంతకీ మంచి సినిమా అంటే ఏమిటి?.. ఈ సందేహం స్వయానా బాలుమహేంద్ర నడుపుతున్న నటనా పాఠశాలలోని విద్యార్థికి కలిగింది. 'సార్‌.. మంచి సినిమా తీయాలంటున్నారు? మరి మంచి సినిమా అంటే ఏమిటి? ఎలాంటిది?' అని ఆ శిష్యుడు అడిగాడు.

    ఇందుకు సమాధానం చెప్పేందుకు ఒకరోజు సమయం కావాలని బాలుమహేంద్ర చెప్పారు. మరుసటిరోజు ఆ శిష్యుణ్ని పిలిచి.. 'మంచి సినిమా అంటే అమ్మచేతి వంటకంలాంటిది. బయట పంచభక్ష్య పరమాన్నం లభించినా అమ్మచేతి వంటకానికి సాటిరాదు. కొన్ని సందర్భాల్లో బయటి తిండి అమ్మ వంటకాన్ని మరిపించొచ్చు. రుచి, ప్రేమానురాగాలు, ఆత్మీయతతోపాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా అమ్మ వంటకంలో ఉంటుంది! మంచి సినిమా కూడా అలాంటిదే'నంటూ జవాబిచ్చారు బాలుమహేంద్ర.

    హృదయ్‌ హీరోగా నటిస్తున్న 'పనివిళుం నిలవు' ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలుమహేంద్ర ఈ అనుభవాన్ని చెప్పారు. కౌశిక్‌ దర్శకత్వంలోని ఈ చిత్రానికి ఎల్‌వీ గణేశన్‌ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విక్రమన్‌, నిర్మాత కేఆర్‌, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Balanathan Benjamin Mahendran is an Indian filmmaker, screenwriter, and cinematographer. He is widely regarded as part of the first in a wave of directors and screenwriters from the Chennai film industry who revitalised Tamil cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X