‘విశ్వరూపం’ బ్యాన్ చేయాలని ముస్లిం సంస్థల డిమాండ్

By Bojja Kumar

చెన్నయ్ : కమల్ హాసన్ తాజా సినిమా 'విశ్వరూపం' విడుదల కాకుండా బ్యాన్ చేయాలని పలు ముస్లిం ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమా చెన్నయ్‌లో సామాజిక సామరస్యంపై ప్రభావం చూపుతుందని ఆయా సంఘాల నేతలు వాదిస్తున్నారు. ఈ సినిమాలో తమ మనోభావాలు దెబ్బతినే విధంగా సన్ని వేశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.

తమిలనాడు ముస్లిం మున్నేట్ర కజగం ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎం.హెచ్. జవహిరుల్లా ఈ విషయమై మాట్లాడుతూ...వివిధ ముస్లిం మత సంస్థల ప్రతినిధులు చెన్నయ్ నగర పోలీస్ కమీషనర్ ఎస్ జార్జ్‌ను కలుసుకున్నామని, ఈ సినిమా ప్రదర్శన కాకుండా నిలిపి వేయాలని డిమాండ్ చేసామని తెలిపారు. " విశ్వరూపం ప్రదర్శన రాష్ట్రంలో సామాజిక సామరస్యంపై ప్రభావితం చూపుతుందని. మేము సెన్సార్ బోర్డ్ వారిని కలవడంతో పాటు, హోమ్ శాఖ కార్యదర్శిని కలవబోతున్నామని' వెల్లడించారు. అవసరం అయితే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.

సినిమాలో తమ మనో భావాలు దెబ్బతీసే విధంగా సన్ని వేశాలు ఉన్నాయనే అనుమానం ఉన్నందున...విడుదలకు ముందే తమకు ప్రత్యేక షో వేసి చూపాలని కొన్ని రోజులుగా ముస్లిం సంఘాల నేతలు కమల్ హాసన్ ను డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే కమల్ హాసన్ నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో వారు తాజాగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేసారు.

సినిమా వివరాల్లోకి వెళితే...
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వరూపం చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈనెల 25న సినిమా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X