నాగచైతన్య హీరోయిన్ పై బ్యాన్?
నాగచైతన్య సరసన బెజవాడ రౌడీలు చిత్రంలో హీరోయిన్ గా అమలా పౌల్ ఎంపిక అయిన సంగతి తెలిసిందే.నాన్న చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మపై త్వరలోనే బ్యాన్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.దానికి కారణం ఆమె తన సొంత ప్రాంతమైన కేరళలో సినిమాలుకు వరసగా నో చెప్పటమేనని తెలుస్తోంది.మళయాళ చిత్రాల్లో నటిస్తే డబ్బు గిట్టుబాటు కాదని భావించిన ఈ ముద్దుగుమ్మ తమిళ,తెలుగు చి్త్రాలపై దృష్టి పెట్టింది.తమిళం, తెలుగు చిత్రాల్లో అవకాశాలు రావడంతో తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసింది.ఈ విషయం తెలుసుకుని ఆగ్రహించిన మలయాళ నిర్మాతల సంఘం తమిళ నిర్మాతల సంఘంతో చర్చించి త్వరలో ఆమెపై నిషేధం ప్రకటించడానికి సిద్ధమవుతోంది. రెడ్‌కార్డ్ ప్రకటిస్తే అమలాపాల్ ఏ భాషా చిత్రంలోనూ నటించే అవకాశం ఉండదు.అయితే విక్రమ్ ఈ విషయంలో కలగచేసుకుని ఆమెను సేవ్ చేయటానకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











