తమిళ అర్జున్‌రెడ్డి ప్రియురాలి ఈమెనే.. ఇక ముద్దులే ముద్దులు
అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ చిత్రం మళ్లీ మొదటికొచ్చింది. టీజర్లు, ట్రీజర్లు రిలీజై సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అప్పటి వరకు షూట్ చేసిన చిత్రాన్ని బుట్టలోపడేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు బాలాను తప్పించి మళ్లీ సినిమాను ఫ్రెష్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వర్మ చిత్రంలో నటించిన హీరోయిన్‌ను కూడా తప్పించి కొత్తగా బనితా సంధూ అనే అమ్మాయిని కథానాయికగా తీసుకొచ్చారు.
బనితా సంధూ లండన్ కింగ్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పుచ్చుకొన్నారు. భారతీయ మోడలింగ్ రంగంలో రాణిస్తున్నారు. వొడాఫోన్, డబుల్ మింట్ వ్యాపార ప్రకటనలకు పనిచేస్తున్నది. పలు టెలివిజన్ షోలలో పాల్గొన్నది.

కాగా, వర్మ చిత్ర దర్శకత్వం బాధ్యతల నుంచి బాలాను తప్పించిన తర్వాత ఈ సినిమాకు కొత్త దర్శకుడిని వెతికే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ డైరెక్టర్‌గా వర్క్ చేయనున్నాడనే వార్త మీడియాలో వైరల్ అయింది.
తమిళ అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారానే ధ్రువ్ సినీరంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











