twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ రచయిల నిరసన..అరెస్ట్ కోసం డిమాండ్

    By Srikanya
    |

    చెన్నై : తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ చూసినా బీప్ సాంగ్ గురించి చర్చే. సంగీత దర్శకుడు అనిరుధ్, శింబు ల గురించి కామెంటేల్. ఈ వివాదస్పదమైన బీప్‌ సాంగ్‌కు రచయితల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

    27 మంది రచయితలు గురువారం ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సినీ గేయ రచయితలు పులమై పిత్తన్‌, ముత్తులింగం, స్నేగన్‌, యుగభారతి, ప.విజయ్‌ తదితరులు విడుదల చేసారు.

    'Beep' song controversy: writers demand arrest

    ఆ ప్రకటనలో ఏముందంటే... తమిళ చలనచిత్ర రంగం అనే భారీ మాధ్యమం నుంచి విడుదలయ్యే రచనలను కోట్ల మంది ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఆ రచనలే హద్దులు దాటితే పలువురి హృదయాలను గాయపరుస్తాయని తెలిపారు. ప్రస్తుతం వివాదస్పదమైన పాట మహిళలను కించపరచేలా ఉందన్నారు.

    ప్రజలు ఇంకా వరద ప్రభావం నుంచి కోలుకోక ముందే మహిళల మనసును గాయపరిచే ప్రక్రియగా ఇది ఉందని పేర్కొన్నారు. విద్యార్థి, మహిళా సంఘాల నిరసనకు మద్దతుగా తాము ఈ ప్రకటన విడుదల చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంలో శింబు, అనిరుధ్‌లు నిర్దోషులైతే... పాటను విడుదల చేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

    English summary
    Ace lyrics Vairamuthu who has not yet listened to the beep song has said that writers and lyricist should be extremely cautious in their use of words as they have a social responsibility to not mislead others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X