దుబాయ్‌ కాదు రోబో సిటీ.. 2.0 ఫీవర్ మొదలైంది.. రజనీ, అక్షయ్, రెహ్మాన్, హంగామా

దుబాయ్‌లో రోబో2.0 ఫీవర్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రోబో 2.0 చిత్ర ఆడియో దుబాయ్‌లో అక్టోబర్ 27న ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. అత్యంత వైభవంగా

By Rajababu

దుబాయ్‌లో రోబో2.0 ఫీవర్ మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రోబో 2.0 చిత్ర ఆడియో దుబాయ్‌లో అక్టోబర్ 27న ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. అత్యంత వైభవంగా జరుగనున్న ఈ వేడుకలో పాలుపంచుకునేందుకు చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే దుబాయ్ చేరుకొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన విషయాలు సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Recommended Video

2.0 Audio Launch Event Tickets Are Being Sold For A Whopping Rs 4 Lakhs
దుబాయ్‌లోని బుర్జ్ పార్కులో

దుబాయ్‌లోని బుర్జ్ పార్కులో

రోబో2.0 ఆడియో వేడుక దుబాయ్‌లోని బుర్జ్ పార్కులో జరుగనున్నది. ఈ వేడుకలో పాల్గొనేందుకు వీలుగా దాదాపు 12 వేల ఉచిత పాసులను అభిమానులకు అందించనున్నారు. ఇప్పటికే ఈ వేడుక కోసం దుబాయ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఏఆర్ రెహ్మాన్ లైవ్ ప్రదర్శన

ఏఆర్ రెహ్మాన్ లైవ్ ప్రదర్శన

రోబో2.0 ఆడియో వేడుకలో సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నాను. అందుకోసం 125 సింఫనీ మ్యూజిషియన్స్ తమ ప్రదర్శనను ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హీరోయిన్ అమీ జాక్సన్ కూడా లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.

రోబో2.0 ఆడియోకు 12 కోట్లు ఖర్చు

రోబో2.0 ఆడియోకు 12 కోట్లు ఖర్చు

రోబో2.0 ఆడియో ఆవిష్కరణ కోసం దాదాపు 12 కోట్లు ఖర్చు చేయనున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలను కేవలం ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడానికి ఖర్చు చేస్తున్నారట. సోషల్ మీడియాలో రోబో2.0 ఆడియో వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముఖ్య అతిథిగా కమల్

ముఖ్య అతిథిగా కమల్

రోబో2.0 ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా కమల్ హాసన్ పాల్గొనున్నారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా పాలుపంచుకోనున్నారు. దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ హాజరయ్యే అవకాశం కూడా ఉంది.

బుర్జ్ అల్ అరబ్‌లో రోబో2.0

బుర్జ్ అల్ అరబ్‌లో రోబో2.0

రోబో2.0 ఆడియో ఆవిష్కణలో భాగంగా గురువారం బుర్జ్ అల్ అరబ్‌లో జరిగే మీడియా సమావేశానికి రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ హాజరయ్యారు. ఇందుకోసం హెలికాప్టర్ ఉపయోగించారు.

నవంబర్‌లో హైదరాబాద్‌లో

నవంబర్‌లో హైదరాబాద్‌లో

ఈ వేడుక అనంతరం వచ్చే నెల హైదరాబాద్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. డిసెంబర్‌లో థియేటరికల్ ట్రైలర్ విడుదల చేస్తారు. 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ చేయనున్నారు.

చెన్నైలో రజనీకాంత్

చెన్నైలో రజనీకాంత్

దుబాయ్‌లో జరిగే కార్యక్రమం కోసం వెళ్తుండగా చెన్నై విమానాశ్రయంలో మీడియా కెమెరాకు చిక్కిన రజనీకాంత్

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రజనీకాంత్, అమీ జాక్సన్‌కు ఘనం స్వాగతం పలుకుతున్న అధికారులు

 మీడియా సమావేశానికి

మీడియా సమావేశానికి

దుబాయ్‌లోని బుర్జ్ పార్కులో నిర్వహించే మీడియా సమావేశానికి వెళ్తున్న రజనీకాంత్, అమీ జాక్సన్ తదితరులు

దుబాయ్‌లో గగన విహారం

దుబాయ్‌లో గగన విహారం

దుబాయ్‌లో హెలికాఫ్టర్‌లో గగన విహారం చేస్తున్న అక్షయ్ కుమార్, శంకర్, ఏఆర్ రెహ్మాన్

దుబాయ్‌లో అభిమానుల జెండాలు

దుబాయ్‌లో అభిమానుల జెండాలు

దుబాయ్‌లో జెండాలు చేతపట్టుకొని ఆనంద సాగరంలో మునిగి తేలుతున్న అభిమానులు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X