Coolie: 28 ఏళ్ల కిందనే డిసైడ్ అయిన లోకేష్ కనగరాజ్.. నాగార్జున విషయంలో బిగ్ సర్ ప్రైజ్
సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం కూలి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఇది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరో 18 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మేకర్స్ గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ పరంగా అనిరుధ్ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించి సినిమాపై మంచి హైప్ ఇచ్చారు. ఇక మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కూలి చిత్రంలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీని చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
తొలిసారిగా విలన్ గా..
అక్కినేని నాగార్జున్ టాలీవుడ్ లో ప్రస్తుతం బడా హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడిగా ఇప్పటికీ అదిరిపోయే యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే నాగార్జున ఇప్పటి వరకు 99 చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. అన్ని జోనర్స్ లలో సినిమాలు చేశారు. కానీ ఆయన కెరీర్ లోనే తొలిసారిగా విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. కోలీవుడ్ భారీ ఫిల్మ్ కూలి చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక అక్కినేని నాగార్జన రోల్ సిమాన్ కు సంబంధించిన విషయాలను తాజాగా లోకేష్ కనగరాజ్ వివరించారు.

28 ఏళ్ల కిందనే ఫిక్స్..
కోలీవుడ్ లో కూలి చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను ఇప్పటికే ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటించిన సిమాన్ పాత్ర గురించి చెప్పుకొచ్చారు. నాగార్జునను రక్షకుడు అనే చిత్రంలో చూసి లోకేష్ కనగరాజ్ ఫిదా అయ్యారంట. 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలోనూ విడుదలైంది. అయితే అప్పుడు నాగార్జున లుక్ ను చూసి విలన్ గా ఎప్పటికైనా నాగార్జునను తెరపై చూపించాలని అనుకుంటున్నాంట. ఇక 28 ఏళ్లకు ఆ కల నెరవేరిందని లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చారు.
7 సార్లు నెరేషన్..
కూలి చిత్రంలో అక్కినేని నాగార్జున కోసం డిజైన్ చేసిన నెగెటివ్ రోల్ లో నటించమని అడిగేందుకు చాలా సమయం పడిందన్నారు. ఇక నాగార్జున సార్ ఒప్పుకోవడం చాలా సమయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. సిమాన్ పాత్రకు సంబంధించిన క్యారెక్టరైజేషన్ ను 7 సార్లు వినిపించానని, ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. ఇక మిగితా స్టార్స్ అంత సమయం తీసుకోలేదని చెప్పారు.
భారీ అంచనాలు..
కూలి చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ నుంచి రాబోతున్న చిత్రం కావడం విశేషం. మరోవైపు రజనీకాంత్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శృతి హాసన్, పూజా హెగ్దే స్పెషల్ సాంగ్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో అప్పియరెన్స్ ఇవ్వబోతుండటంతో భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ రూ.350 కోట్లతో నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











