'వేదం' తమిళ రీమేక్ వెనక మాస్టర్ ప్లాన్!?
తెలుగులో విజయవంతమైన 'వేదం' చిత్రం తమిళంలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రీమేక్ చేయటంలో కొన్ని ప్రత్యేక ఉద్దేశ్యాలున్నాయంటున్నారు. అందులో ముఖ్యంగా ఒకటి అనుష్క పాత్ర. అనుష్క చేసిన సరోజ పాత్రని రీషూట్ చేయకుండా యధాతధంగా ఉంచేసి డబ్బింగ్ చేసి కలిపే ఆలోచనలో ఉన్నారట. అలాగే మనోజ్ పాత్రను కూడా తమిళంలోకి తీసుకోవటానికి కారణం కూడా అదేనట.నిర్మాతకు సగానికి సగానికి సగం ఖర్చు తగ్గిపోతుందని యోచిస్తున్నారుట. కేవలం అల్లు అర్జున్ పాత్ర కేబుల్ రాజుని ఒక్కదాన్నే శింబుతో రీషూట్ చేసి కలిపి వదులుతారని తెలుస్తోంది. ఇవన్నీ ఆలోచించే క్రిష్ నే దర్శకుడుగా ఎంచుకున్నారని చెప్తున్నారు. అనుష్కకి ఎలాగూ సింగం చిత్రం తర్వాత మంచి క్రేజ్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవచ్చునని ప్లాన్ చేస్తున్నారని తమిళ వర్గాల్లో ప్రముఖంగా వినపడుతోంది. ఇక కాంబినేషన్ సీన్స్ ఓ నాలుగు రోజులు షూటింగ్ పెట్టుకుంటే సరిపోతుందని,అందుకు డేట్స్ తీసుకుంటే సినిమా పూర్తైపోతుందని ఆలోచనగా చెప్తున్నారు. సగం డబ్బింగ్..సగం రీషూట్ తో వేదం కొత్త రూపు సంతరించుకుంటుందన్నమాట. మంచి స్ట్రాటజీనే.


Click it and Unblock the Notifications











