For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తన గంజాయి అలవాటు గురించి చెప్పి షాకిచ్చిన ప్రముఖ నటుడు, దర్శకుడు!

    |

    డ్రగ్స్ పేరు వినిపిస్తే చాలు అందులో సినిమా రంగానికి ఏదో ఒకలింకు కనబడుతుంది. ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు, ఇటీవల బాలీవుడ్లో కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన పార్టీలో సినీ స్టార్స్ డ్రగ్స్ తీసుకున్నారంటూ ఓ పోలిటీషియన్ ఆరోపణలు ఇలా... మాదక ద్రవ్యాల వివాదాల్లో సినిమా వాళ్ల పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది.

    ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ తన గంజాయి అలవాటు గురించి వెల్లడించడం హాట్ టాపిక్ అయింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ తమిళ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకలో ఆయన తాను ఒకప్పుడు గంజాకి అలవాటు పడినవాడినే అని ఒప్పుకున్నారు.

    కోలా మూవీ ఆడియో రిలీజ్ వేడులో

    కోలా మూవీ ఆడియో రిలీజ్ వేడులో

    విక్కీఆద్మియ, వైశాక్‌, హరిణి ప్రధాన పాత్రల్లో మోతీ ఆర్ట్స్‌ పతాకంపై మోతీఫా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కలా'. కణ్మణిరాజా సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంటుకు భాగ్యరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ జాగ్వుర్‌తంగం గంజాయి అలవాటు గురించి ప్రస్తావన తెస్తూ ఆవేశంగా ప్రసంగించారు.

    తనకూ గంజాయి అలవాటు ఉందని చెప్పిన భాగ్యరాజ్

    తనకూ గంజాయి అలవాటు ఉందని చెప్పిన భాగ్యరాజ్

    ఈ సందర్భంగా భాగ్యరాజ్ తనకూ ఒకప్పుడు గంజాయి అలవాటు ఉండేదని వెల్లడించారు. ఓసారి కోయంబత్తూర్‌లో తన అసిస్టెంట్ ఒకరు గంజాయి సిగరెట్ ఇచ్చారని, అలా తాను గంజాయికి అడిక్ట్ అయినట్లు తెలిపారు. గంజాయి లాంటావి మొదట్లో బావుంటాయి. తర్వాత వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు.

    గంజాయి మత్తులో పడి...

    గంజాయి మత్తులో పడి...

    ఏదో సాధించాలని ఇండస్ట్రీకి వచ్చిన తాను గంజాయి మత్తులోపడిన కొన్నాళ్లకు ఏం కోల్పోతున్నానో అనే విషయంలో రియలైజ్ అయ్యాను. చాలా కష్టపడి ఆ అలవాటు మానుకున్నాను. తర్వాత సినిమాల మీదే పూర్తి ఫోకస్ పెట్టి రాణించినట్లు గుర్తు చేసుకున్నారు.

    భాగ్యరాజ్

    భాగ్యరాజ్

    నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ తమిళం, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించారు. గత కొన్నేళ్లుగా ఆయన నటనకు మాత్రమే పరిమితం అయ్యారు. ఈ ఏడాది తెలుగులో వచ్చిన ‘సీత' చిత్రంలో నటించారు.

    English summary
    Bhagyaraj reveals about his marijuana habit. Bhagyaraj said he now abstains from his marijuana habit. Krishnasaamy Bhagyaraj is an Indian director, actor, screenwriter, music director, producer and Politician active mainly in Tamil films. He has also written and directed Telugu and Hindi films and TV serials.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X