కన్న తండ్రి కాటు, హీరోయిన్ ఆవేదన

అంతేగాక ఆమె సంపాదించిన సొమ్మునంతటినీ బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఖర్ఛుపెట్టుకుంటున్నాడనీ,ఒక్క పైసా కూడా తనకి మిగల్చడనీ, ఏదైనా అవసరముంటే చెప్పి తీసుకోవాలనీ ఏడ్చినంత పనిచేసింది. దాంతో అక్కడకి అటెండయిన మీడియా వాళ్ళు అదేంటీ మీ నాన్న కొద్దిరోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ,మీ అమ్మ కలసి తన్ని తరిమేసారనీ, తన ముసలి తల్లితండ్రులతో రోడ్డు పై పడాల్సి వచ్చిందని చెప్పేడే అని నిలదీసారు. దానికామే తన చిన్నప్పటి స్టోరీ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె యు.కె.జీ చదివేటప్పుడే ఆమె తండ్రి అందరినీ వదిలేసి పరారయ్యాడు.
తర్వాత ఓ బ్యూటి పార్లర్ పెట్టుకుని భాను తల్లి,ఆమె మేనమానలు కష్టపడి కుటుంబాన్నీ లాక్కొచ్చారుట. ఆమె ఎనిమిదో తరగతి చదివేటప్పుడు లాల్ జోషి అనే మళయాళ దర్శకుడు కంట్లో పడటం అతను Achan Urangatha Veedu అనే సినిమాలో హీరోయిన్ వేషం ఇచ్చాడు. తర్వాత ఆమె అక్కడ రాత్రింబవళ్ళూ కష్టపడి ఎదిగి ఈ స్దాయికి వస్తే ఆ తండ్రి మళ్ళీ వారి జీవితాల్లోకి ప్రవేశించాడు. బ్యాంక్ ఎకౌంట్,లాకర్ దగ్గరనుండీ అన్నీ ఆక్రమించుకున్నాడు.తర్వాత భరణి చిత్రంలో ఎక్స్ పోజింగ్ చేస్తూ నటించాలని హెరాస్ చేసాడు... అలాంటి వాడు మా తండ్రా..ధూ అంటూ ఏవగింపుగా మాట్లాడింది.


Click it and Unblock the Notifications











