కన్న తండ్రే కసాయిలా ప్రవర్తించాడంటూ ఏడుస్తోంది
విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన 'భరణి' చిత్రం హీరోయిన్ భాను గుర్తుందా?.ఆమె రీసెంట్ గా మరో సారి తన తండ్రి దుర్మార్గాన్ని మీడియా వద్ద తిట్టిపోసింది. తాను సినిమాల్లో ఉన్నత స్థాయికి చేరుకోకపోవడానికి కారణం తన తండ్రేనని, అందుకే ఆయనకు దూరంగా వచ్చేశానని అందామె. విశాల్‌కు జంటగా తామ్రభరణి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె చాలా గ్యాప్ తర్వాత చట్టబడి కుట్రం చిత్రంలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తామ్రభరణి వంటి విజయవంతమైన చిత్రంలో నటించినా తమిళంలో మంచి స్థాయికి చేరుకోలేకపోయానన్నారు. అందుకు కారణం తన తండ్రి ప్రవర్తనేనని అంది.అలాగే ఈ మళయాళ ముద్దుగుమ్మ ఆ మధ్య కేరళలోని కొచ్చిలో ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి జార్జి తననీ,తన తల్లినీ హెరాస్ చేస్తున్నాడనీ పోలీస్ కంప్లైంయింట్ ఇచ్చానని చెప్పింది.
ఆమె చెప్పేదాని ప్రకారం భాను తండ్రి దర్శక,నిర్మాతలతో కుమ్మక్కయి ఎక్సపోజ్ చేయమంటున్నాడనీ,అర్దనగ్న దుస్తులు వేసుకోమంటున్నాడనీ ఆరోపించింది.పారితోషికాన్ని ఒక్కసారిగా రూ.25 లక్షలకు పెంచేయడం, గ్లామరస్‌గా నటించమని ఒత్తిడి చేయడం వంటివి తనకు నచ్చలేదని అన్నారు. అందువల్లే పలు చిత్రాలు చేయలేకపోయానని వివరించారు. ప్రస్తుతం అన్ని సమస్యలు తీరిపోయాయని, ఇకపై పూర్తిగా చిత్రాలపైనే దృష్టి పెట్టనున్నానని పేర్కొన్నారు. చట్టబడి కుట్రం తనకు మంచి గుర్తింపు తెస్తుందన్నారు. మలయాళంలో దిలీప్‌కు జంటగా ఫిలింస్టార్, వినుమోహన్ సరసన ఇతిరైక్కినిడైయిల్ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి తను సంపాదించిన సొమ్మునంతటినీ బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఖర్ఛుపెట్టుకుంటున్నాడనీ,ఒక్క పైసా కూడా తనకి మిగల్చడనీ, ఏదైనా అవసరముంటే చెప్పి తీసుకోవాలనీ ఏడ్చినంత పనిచేసింది.
దాంతో అక్కడకి అటెండయిన మీడియా వాళ్ళు అదేంటీ మీ నాన్న కొద్దిరోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ,మీ అమ్మ కలసి తన్ని తరిమేసారనీ, తన ముసలి తల్లితండ్రులతో రోడ్డు పై పడాల్సి వచ్చిందని చెప్పేడే అని నిలదీసారు. దానికామే తన చిన్నప్పటి స్టోరీ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె యు.కె.జీ చదివేటప్పుడే ఆమె తండ్రి అందరినీ వదిలేసి పరారయ్యాడు. తర్వాత ఆమె అక్కడ రాత్రింబవళ్ళూ కష్టపడి ఎదిగి ఈ స్దాయికి వస్తే ఆ తండ్రి మళ్ళీ వారి జీవితాల్లోకి ప్రవేశించాడు. బ్యాంక్ ఎకౌంట్,లాకర్ దగ్గరనుండీ అన్నీ ఆక్రమించుకున్నాడు.తర్వాత భరణి చిత్రంలో ఎక్స్ పోజింగ్ చేస్తూ నటించాలని హెరాస్ చేసాడు... అలాంటి వాడు మా తండ్రా..ధూ అంటూ ఏవగింపుగా మాట్లాడింది.


Click it and Unblock the Notifications











