దర్శకుడు క్రిష్ దెబ్బకొట్టాడంటూ హీరో...
దర్శకుడు క్రిష్ కధ చెప్పేటప్పుడు ఒకలా చెప్పి సినిమా పూర్తయ్యేసరికి సీన్ మార్చేసాడంటూ తమిళ నటుడు భరత్ కామెంట్ చేసాడు. రీసెంట్ గా తమిళంలో క్రిష్ తన తెలుగు హిట్ వేదం ని రీమేక్ చేసాడు. అందులో భరత్ కి తెలుగులో మనోజ్ చేసిన పాత్ర ఇచ్చాడు. అలాగే అల్లు అర్జున్ పాత్రను శింబు చేసాడు. శింబే ఎక్కువగా పోస్టర్స్ వేసి హైలెట్ చేసి,ఎడిటింగ్ లో తన నిడివి తగ్గించటంతో భరత్ కి కాలి ఇలా యుద్దానికి దిగాడు.
అయితే ఈ మ్యాటర్ పై మరో హీరో శింబు వివరణ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ... ఇద్దరు హీరోల చిత్రంలో ఎవరికి మార్కెట్ ఉంటుందో వారికి ప్రాధాన్యత నిస్తారన్నారు. చిత్రంలో నటించిన నటులందరి ఫొటోలను పోస్టర్లలో వేయలేమని పేర్కొన్నారు. భరత్ ఆరోపణలను తాను పట్టించుకోనని అన్నాడు. ఇక తెలుగులోనూ ఇదే మ్యాటర్ పై అప్పట్లో వివాదం చెల రేగిన సంగతి తెలిసిందే. మొత్తానికి క్రిష్ తమిళంలోకి కూడా వెళ్ళి కథనే కాకుండా వివాదాన్ని కూడా కంటిన్యూ చేసాడన్నమాట.


Click it and Unblock the Notifications











