తమిళ 'వేదం' షూటింగ్ లో భరత్ కి యాక్సెడెంట్...
తెలుగులో హిట్టయిన వేదం చిత్రం తమిళంలో వానమ్ పేరిట రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో మనోజ్ చేసిన రాక్ స్టార్ పాత్రను ప్రేమిస్తే...భరత్ పోషిస్తున్నారు. ఈ షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ ను డూప్ లేకుండా భరత్ చేస్తున్నారు. ఆగస్టు 6 నుంచి భరత్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభమయింది. నలభై అడుగుల కొండ మీదనుంచి దూకే సీన్ కోసం డూప్ ని తీసుకోకుండాచేసారు. అది బాగా వచ్చింది. దాంతో మరో సారి జీప్ వెనక పరుగెత్తే ఛేజింగ్ సీన్ ను కూడా అదే కాన్పిడెన్స్ తో ప్లాన్ చేసారు. అయితే ఈ సారి సీన్ రివర్స్ అయింది. అనుకోకుండా ఆ జీప్ ని గుద్ది అద్దం పగలకొట్టి పడ్డారు. దాంతో కుడి చెయ్యి బాగా దెబ్బతింది. దాంతో అతన్ని దగ్గరలో ఉన్న హాస్పటిల్ తీసుకెళ్ళితే మూడు కుట్లు పడ్డారు. శింబు, అనుష్క, స్నేహా ఉల్లాల్, భరత్ ప్రధాన పాత్రల్లో చేస్తున్న ఈ చిత్రంపై అక్కడా మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులో డైరక్ట్ చేసిన క్రిష్..తమిళంలో కూడా దర్సకత్వం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











