ఫ్రౌఢ అందాలకే సై...'ప్రియమణి'కి నై

By Staff

Arumugam
తమిళంలో ఇప్పడు ఆర్ముగం పేరుతో ఓ సినిమా రెడీ అవుతోంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రేమిస్తే భరత్ హీరోగా చేస్తున్నాడు. భాషా వంటి సూపర్ హిట్ చిత్రం డైరక్ట్ చేసిన సురేష్ కృష్ణ ఈ దీన్ని డైరక్ట్ చేస్తున్నాడు. కధను అనుసరించి అతను రోడ్డు ప్రక్కన ఇడ్లీ బండి నడుపుకుంటూంటాడు. అతని తల్లి సీత . ఆమెను పెద్ద పారిశ్రామిక వేత్త అయిన రమ్యకృష్ణ అవమానిస్తుంది. దాంతో భరత్ ఆవేశంగా ఆమెను ఛాలెంజ్ చేస్తాడు. ఆ సినిమాలో రమ్యకృష్ణ విలన్ గా చేస్తుంటే ...ప్రియమణి హీరోయిన్ గా కనపడుతుంది.

రమ్యకృష్ణ గతంలో నరసింహా సినిమాలో చేసిన నీలాంబరి తరహా లో హీరోని ఏడ్పిద్దామని ఛాలెంజ్ లు చేస్తూ తిర్గుతుందిట. ఇక ప్రియమణి హీరోతో లివ్..ఇన్..రిలేషన్ షిప్ లో ఉండే ముద్దుగుమ్మట. ప్రియమణి తన అందాలతో అదరకొట్టబోతోందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రమ్యకృష్ణే సినిమాలో చాలా హాట్ గా కనపడుతోందిట. తన ప్రౌఢ అందాలను బాగా ఎక్సపోజ్ చేస్తూ స్టిల్స్ ఇచ్చిందిట. దాంతో పోస్టర్స్ వాటితోనే డిజైన్ చేస్తున్నారుట.

దాంతో ప్రియమణికి చిర్రెరెత్తుతోందిట. అందులోనూ షూటింగ్ జరిగినన్నాళ్ళూ రమ్యకృష్ణ కే సెట్ లో బాగా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు ఆమె ఫీలియ్యేదుట. మరీ ముఖ్యంగా భరత్ ..రమ్యతోనే ఎక్కువ సేపు గడపటం ఆమెకు అరికాలిమంట నశాళానికి ఎక్కేదిట. ఏం చేస్తుంది పాపం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X