ఎస్పీ బాలు పరిస్థితి చూసి.. భోరున విలపించిన భారతీరాజా
కరోనావైరస్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగా మారిందనే విషయంపై సినీ ప్రముఖులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తమిళ మీడియాలో వస్తున్న రూమర్లను ఎస్పీ బాలు కుమారుడు చరణ్ ఖండించారు. నాన్న ఆరోగ్యం విషమంగా ఉంది. అయితే మీడియా వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నది.
ఈ సందర్భంగా బాలు ఆరోగ్య వార్తలను విన్న ఆయన అత్యంత స్నేహితుడు, దర్శకుడు భారతీరాజా ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. త్వరగా బాలు కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిద్దాం. బాలు ఆత్మస్థైర్యం గొప్పదిజ బాలు ఆరోగ్యవంతుడిగా మార్చి ఆ భగవంతుడు మన మద్దకు పంపతారు. బాలుకు ఎలాంటి బాధ కలగకుండా ప్రార్థిస్తాం అంటూ భారతీరాజా వీడియోలో పేర్కొన్నారు.

ఓ దశలో బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ భారతీరాజా భోరున విలపించాడు. నా స్నేహితుడు సురక్షితంగా దిగి వస్తారంటూ దుఖాన్ని దిగమింగుకుంటూ బాలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాలు, భారతీరాజా మధ్య విడదీయలేని బంధం ఉంది. గత 50 ఏళ్లుగా వారిద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. భారతీరాజా అంటే బాలుకు చెప్పలేనంత ప్రేమ, గౌరవం. తన షోలలో రాజా అంటూ బాలు ప్రేమను కురిపించిన సందర్భాలు అనేకం.

ఇక బాలు త్వరగా కోలుకోవాలని తెలుగు మ్యూజిక్ అసోసియేషన్ సంఘం సభ్యులు సామూహిక ప్రార్థనలను నిర్వహించారు. ఆర్పీ పట్నాయక్‌తోపాటు గాయనీ, గాయకులు విజయలక్ష్మీ, గీతామాధురి తదితరులు ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











