పురుచ్చి తలైవిగా అనుష్క, క్రేజీగా జయలలిత బయోపిక్.. ఐశ్వర్యారాయ్‌తో పోటీ!

Recommended Video

Jayalalithaa Biopic : Directors Compete To Direct The Movie

పురుచ్చి తలైవి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రోజు రోజుకు క్రేజీగా మారుతోంది. బయోపిక్ ఇంతవరకు ప్రారంభం కానేలేదు. అప్పుడే దర్శకుల, నిర్మాతల మధ్య ఈ చిత్రం గురించి పోటీ నెలకొని ఉంది. అమ్మ బయోపిక్ ని తామే తెరకెక్కిస్తాం అని ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. ఈ గందరగోళంలో తాజాగా అత్యంత ఆసక్తికరమైన ప్రకటన జయలలిత బయోపిక్ గురించి వచ్చింది.

అమ్మ పాత్రలో ఐశ్వర్యారాయ్

అమ్మ పాత్రలో ఐశ్వర్యారాయ్

జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్ ని నటింపజేసేందుకు తాజగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త లెజెండరీ దర్శకుడు భారతీ రాజా కాంపౌండ్ నుంచి రావడంతో ఉత్కంఠ నెలకొంది.

 దర్శకుల మధ్య పోటీ

దర్శకుల మధ్య పోటీ

జయలలిత జీవితంలో అంత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ధైర్యానికి అమ్మ పెట్టింది పేరు. పురుచ్చి తలైవి జీవిత గాధని వెండి తెరపై ఆవిష్కరిస్తే అద్భుత విజయం దక్కించుకోవడం ఖాయం. అందువలనే దర్శకుల మధ్య పోటీ నెలకొని ఉంది. ఏఎల్ విజయ్, ప్రియదర్శిని ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పోటీ పడుతున్నారు. ఆ జాబితాలోకి భారతీ రాజా కూడా చేరారు.

అనుష్క అయితే

అనుష్క అయితే

దర్శకుడు భారతీ రాజా జయలలిత బయోపిక్ కోసం ఐశ్వర్యారాయ్ తో పాటు సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క లేడి ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. జాతీయ స్థాయిలో మార్కెట్ ప్రకారం ఐశ్వర్యారాయ్ ని ఎంపిక చేసే అవకాశం ఉంది. కానీ సౌత్ లో అనుష్క కు ఉన్న క్రేజ్ కొట్టిపారేసేది కాదు.

రెండు టైటిల్స్

రెండు టైటిల్స్

భారతీ రాజా జయలలిత బయోపిక్ కోసం అమ్మ, పురిచ్చి తలైవి అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే జయలలిత బయోపిక్ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఎంజీఆర్ పాత్రలో

ఎంజీఆర్ పాత్రలో

ప్రముఖ నిర్మాత ఆదిత్య భరద్వాజ్, భారతీరాజా కలయికలో ఈ చిత్రం రాబోతోంది. ఏ విషయాన్ని నిర్మాత ఆదిత్య స్వయంగా వెల్లడించారు. జయలలిత బయోపిక్ లో ఎంజీఆర్ పాత్ర కోసం కమల్ హాసన్, మోహన్ లాల్ పేర్లు పరిశీలిస్తున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X