భారతీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం.. కుమారుడు ఆకస్మిక మృతి.. కారణం ఏమిటంటే?

దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకొన్నది. ఆయన కుమారుడు మనోజ్ ఆకస్మిక మరణం చెందడంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలియజేస్తున్నారు. భారతీరాజా కుమారుడు మనోజ్ మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సినీ పరిశ్రమలో భారతీరాజా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నటుడిగా అడుగుపెట్టారు. 1999 సంవత్సరంలో తాజ్ మహల్ అనే చిత్రం ద్వారా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే నటుడిగా ఆయన కెరీర్ ఊహించనంతగా ముందుకు సాగలేదు. కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత ఆయన నట జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది.

Bharathiraja s son Manoj died

మనోజ్ నటుడిగా మారడానికి ముందు ఆయన మణిరత్నం, శంకర్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆయన తనతో సాదురియాన్ అనే చిత్రంలో నటించిన సహనటి నందనను వివాహం చేసుకొన్నారు. వారికి అర్థిక, మాథివాడని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు మనోజ్ పేరుతో భారతీరాజా మనోజ్ క్రియేషన్స్ సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ బ్యానర్‌పై పలు చిత్రాలు నిర్మించారు.

మనోజ్ తన కెరీర్‌లో సముద్రం, కదల్ పూక్కల్, అల్లీ అర్జున, వరుషమెల్లమ్ వసంతమ్, పల్లవన్, ఎర్రనీలం, మహా నడిగన్, అన్నక్కొడి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ లాడర్స్‌లో కూడా నటించారు. 2022 సంవత్సరంలో ఆయన నటించిన చివరి చిత్రం విరుమన్.

అయితే కొద్ది రోజుల క్రితం ఆయన హార్ట్ సర్జరీ చేయించుకొన్నారు. మనోజ్ మంగళవారం సాయంత్రం గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగానే చెన్నైలోని చెట్‌పెట్‌లోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మరణంతో తమిళ సినీ రంగం తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: bharathiraja manoj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X