twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదహారేళ్ల వయసులో ‘పాంచాలి’.. దానికి అంతం లేదు.. రాధికపై డైరెక్టర్ కామెంట్స్

    |

    తెలుగు తెరపైనే కాకుండా దాదాపు అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుకుంది రాధిక. అయితే తమిళంలో పదహారేళ్ల వయసులోనే కెరీర్‌ను మొదలుపెట్టింది. అది కూడా దర్శకదిగ్గజం భారతీ రాజా దర్శకత్వంలోనే కెరీర్‌ను మొదలుపెట్టింది. ఆగస్ట్ 10 నాటికి రాధికా నటిగా 42 ఏళ్లు పూర్తి కావడంతో తెగ ఎమోషనల్ అయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తన ప్రయాణం ఇంత వరకు సాగుతుందని ఊహించలేదని అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.

    అక్కడా, ఇక్కడా..

    అక్కడా, ఇక్కడా..

    వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంది హీరోలతో జంట కట్టిన రాధిక.. బుల్లితెర మహారాణిగా క్రేజ్ సంపాదించుకుంది. సొంతంగా రాడాన్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉపాధిని కలిగిస్తోంది. ఇప్పటికీ సీరియళ్లతో అందర్నీ అలరిస్తూనే ఉంది. నటిగా 42 ఏళ్లు పూర్తి కావడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది.

     ఎన్నడూ ఊహించలేదు..

    ఎన్నడూ ఊహించలేదు..

    నటిగా 42 ఏళ్లు పూర్తి కావడంతో రాధిక ట్వీట్ చేస్తూ.. ‘నేను ఇంత వరకు వస్తానని ఊహించనే లేదు. నటిగా నా పనిని సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు ఎప్పుడూ కూడా శక్తిమేరకు ప్రయత్నించాను. అదే ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది. అదే నాకు సంతోషాన్ని ఇచ్చింది. అదే సపోర్ట్, అదే ప్రేమ నాకు ఇంకా చూపిస్తారని నమ్ముతున్నా.. థ్యాంక్స్ టూ ఆల్' చెప్పుకొచ్చింది.

     పాంచాలితో పరిచయం..

    పాంచాలితో పరిచయం..

    రాధికను నటిగా పరిచయం చేసిన భారతీ రాజా స్పందించారు. ఈ మేరకు సోషల్ మడియాలో ఎమోషనల్ అయ్యాడు. ‘పదహారేళ్ల వయసులో పాంచాలి అనే పాత్రతో తెరకు పరిచయం చేశాను. నటనా జీవితానికి పచ్చ జెండా ఊపాను. ఈ రోజుకు ఆ ప్రయాణం 42 ఏళ్లు అయింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకను ఆపలేదు. తెరపై నీ ప్రయాణం అనంతమైంది.. అంతులేని పాలపుంత వంటిది. నీ ప్రేమకు అంతే లేద'ని ట్వీట్ చేశాడు.

    పురుషాధిక్యత..

    పురుషాధిక్యత..

    భారతీ రాజా ట్వీట్‌పై రాధికా స్పందిస్తూ.. ‘ఇంతకంటే గొప్పగా ఏదైనా ఉంటుందా? నేను ఎవరినో.. ఇంత వరకు వచ్చానంటే అది కేవలం మీ వల్లే. మీ ఆశీర్వాదం వల్లే ఇంత ఎత్తుకు ఎదిగాను. ఇలాంటి పురుషాధిక్యత ప్రపంచంలో మహిళల విజయాన్ని కూడా సెలెబ్రేట్ చేయని తరుణంలో మీ ప్రశంసలు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయ'ని ఎమోషనల్ అయింది.

    English summary
    Bharatiraja About Radika On Panchali Character. Radhika completes 42 years in the industry, as it was on August 10, 1978 that her debut film Kizhakke Pogum Rail directed by Bharathiraja was released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X