బొమ్మరిల్లు భాస్కర్ నెక్స్ట్ ఖరారు
ఆరెంజ్ వంటి డిజాస్టర్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ కి తెలుగులో ఏ హీరో డేట్స్ ఇవ్వలేదు. దాంతో భాస్కర్ తమిళ హీరోలను ఆశ్రయించారు. సూర్య తమ్ముడు కార్తితో ఆయన తన తదపరి చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తి కూడా స్క్రిప్టు ఓకే చేసి తెలుగ, తమిళ భాషల్లో ఒకేసారి చేద్దామని ప్లాన్ చేసుకోమని చెప్పినట్లు సమాచారం. యాక్షన్ తో దూసుకుపోతున్న కార్తికి ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ దక్కేలా స్క్రిప్టుని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఛత్రపతి నిర్మించిన ప్రసాద్ నిర్మించనున్నారు. రీసెంట్ గా ఈ శుక్రవారం కార్తీ నటించిన తమిళ చిత్రం నా పేరు శివ టైటిల్ తో విడుదలైంది. అయితే భాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా వర్కవుట్ కాలేదు. కానీ ప్రమోషన్ కోసం ఇక్కడకు వచ్చిన కార్తీ త్వరలేనే తెలుగు స్ట్రైయిట్ సినిమా చేయబోతున్నానని, త్వరలో వివరాలు ప్రకటిస్తానని అన్నారు.


Click it and Unblock the Notifications











