ఆ హీరోయిన్స్ కుట్ర కు నేను బలైపోతున్నాను...భావన
నా సక్సెస్ ను ఓర్వలేకనే ఈ తరహా ప్రేమ, పెళ్లి పుకార్లుతో కుట్ర పన్నుతున్నారని హీరోయిన్ భావన ఆగ్రహం వ్యక్తం చేసింది. రీసెంట్ గా ఆమె తెలుగు హీరో నితిన్ తో పెళ్ళి కాబోతోందని తమిళ, తెలుగులలో రూమర్స్ వినపడితే, మళయాళంలో హీరో పృధ్వీరాజ్ తో ఆమెకు పెళ్లి అయినట్లు వదంతులు ప్రచారం చేస్తున్నారు. ఈ కారణంగా భావనకు వచ్చిన రెండు అవకాశాలు ఎగిరిపోయాయని చెప్తోంది. దీని గురించి భావన మాట్లాడుతూ కన్నడంలో పెళ్లి అయిన వాళ్ళను హీరోయిన్లుగా చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడరు. దాంతో అక్కడ మార్కెట్ ని దెబ్బ కొట్టడానికి కొందరు హీరోయిన్లు కావాలని చేస్తున్న అసత్య ప్రచారం ఇది. వీటి కారణంగానే నా అవకాశాలుపోతున్నాయని, ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, తానొక వ్యక్తిని ప్రేమించిన మాట నిజమేనని, అతను మలయాళ నటుడు మాత్రం కాదని వివరణ ఇచ్చింది. ఇక తెలుగులో హీరో, మహాత్మ వంటి కొన్ని చిత్రాలు చేసినా ఫలితం కనిపించలేదు. దాంతో కన్నడంలో ప్రవేసించింది. అక్కడ శివరాజ్ కుమార్ సరసన నటించిన చిత్రం మంచి విజయం సాధించడంతో అక్కడ మంచి పేరు వచ్చింది. ఆమె ఎదుగుదల అక్కడ పాపులర్ హీరోయిన్లు కొందరికి నచ్చక ఈ కుట్ర చేసారంటోంది. అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications











