ప్లీజ్ రేప్ వద్దు: భావన
ఒంటరి చిత్రంలో రేప్ కి గురైన అమ్మాయిగా చేసిన హీరోయిన్ భావనకి తమిళంలో ప్యామిలీ హీరోయిన్ గా మంచి డిమాండ్, ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒంటరి చిత్రాన్ని తమిళంలో సుబ్రమణ్యం పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. అయితే అందులో కీలకమైన కథకు మలుపు తిప్పే రేప్ సన్నివేశాన్ని తొలిగించమని భావన పట్టుబట్టడం అందరినీ ఇబ్బందిపెడ్తోంది.
తెలుగులో అంటే ఇమేజ్ లేదు కాబట్టి ఫరవాలేదు కానీ..తమిళంలో ఫ్యామిలీ ఆడియెన్స్ నా సినిమా అంటే ఏమేమో ఊహించుకుని వస్తారు. వారు ఆ రేప్ సన్నివేశాలు తట్టుకోలేరు. ప్లీజ్..అర్ధంచేసుకోండి అని నిర్మాతలకు చెప్తోంది. ఇక కథకు పునాది అయిన ఆ సన్నివేశం తీసేస్తే ఇక అది డబ్బింగ్ చేయటం అనవసరమని ఆమెకు చెప్పారుట. అయితే ఆమె గోపీచంద్ తో చెప్పించే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది. అంతగాకాకపోతే ఆమె ప్రియతమ స్నేహితుడు నితిన్ రంగంలోకి దూకి ఆపుచేస్తాడేమో చూడాలి అంటున్నారు.


Click it and Unblock the Notifications











