కార్తీ ప్రక్కన చేయనని చెప్పేసింది
తమిళ స్టార్ హీరో కార్తి ప్రక్కన చేయాలని హీరోయిన్స్ అంతా ఉవ్విళ్లూరుతుంటే భావన మాత్రం నో చెప్పేసింది. మహాత్మ చిత్రంతో తెలుగునాట పరిచయమైన ఈ భామ తాను గ్లామర్ రోల్స్ చెయ్యలేనని, అందుకే కార్తీ ఆఫర్ ఇచ్చినా చేయనని రిజెక్టు చేసింది. దాంతో కోలీవుడ్ మొత్తం ఆమెను షాక్ గా చూసారు. తెలుగులోనూ ఆఫర్స్ లేని ఆమె, తమిళంలో కాళ్ల వరకూ వచ్చిన పెద్ద ఆఫర్ ని ఎందుకు వదిలేసుకుందో అని అర్దం కాక చూస్తూంటే ఆమె ఇలా శెలవిచ్చింది. దాంతో ఆమెను తమ ప్రాజెక్టుల్లోకి తీసుకుందామనుకునే మరికొద్ది మంది కూడా ఆలోచనల్లో పడిపోయారు. ప్రస్తుతం ఆమె కన్నడంలో బిజీగా ఉంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. కన్నడంలో నా తొలి చిత్రం జోష్, తర్వాత నటించిన విష్ణువర్ధనా చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఆ తర్వాత గణేష్ కు జంటగా రోమియో చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. అలాగే మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ సరసన నటించిన చిత్రం కూడా త్వరలో రిలీజ్ కానుందని చెప్పింది. మరి తమిళ సినిమాల్లో ఇక చేయనట్లేనా అంటే... కోలీవుడ్‌లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని అంది. శింబుపై ఆ మధ్యన కామెంట్ చేసిన ఆమెపై తమిళ పెద్దలు నిరశన వ్యక్తం చేసారు. అది దృష్టిలో పెట్టుకునే ఆమె తమిళాన్ని ఎవాయిడ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications