భీమxదశావతారం!
తమిళంలోనూ సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. విక్రమ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన భీమ సినిమా, కమల్ హాసన్ పదిమంది హీరోయిన్లతో కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దశావతారం కూడా సంక్రాంతికి విడుదల అవనున్నాయి. ఈ రెండు చిత్రాలకు సామ్యం ఉంది. అదేమంటే భీమ సినిమా 2006 మే నెలలో లింగుస్వామి దర్శకత్వంలో ప్రారంభమయింది. ఆర్థిక కారణాల వలన ఈ మధ్యనే నిర్మాణాన్ని పూర్తిచేసుకుంది.
ఇక దశావతారం విషయానికి వస్తే కమల్ హాసన్ ఈ చిత్రంలో పది పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం కూడా చాలాకాలంగా కొనసాగుతోంది. భీమ, దశావతారం చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు. సంక్రాంతి రేసులో దశావతారం, భీమ చిత్రాలే ఉన్నాయి. అజిత్, విజయ్ ల సినిమాలేవీ సంక్రాంతికి విడుదల కావడంలేదు. ఆర్థిక ఇబ్బందులే లేకపోతే భీమ సినిమా ఎపుడో విడుదల కావలసింది. భీమ సినిమా నిర్మాత ఎఎమ్ రత్నంను ఈ మధ్యే నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు ఆదుకోవడానికి ముందుకు రావడంతో ఈ సినిమా కష్టాలనుంచి గట్టెక్కి థియేటర్ బాటపట్టింది. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందో మరి.

Click it and Unblock the Notifications