ఎస్సై సాక్ష్యం....ఇరుక్కున్న భువనేశ్వరి
భువనేశ్వరి పై మరో రెండు మోసం కేసులు కూడా నమోదయ్యాయి. వ్యభిచార కేసుకు సంబంధించి గత 10వ తేదీ భువనేశ్వరికి సైదాపేట కోర్టు ఛార్జ్‌షీటు నకలు అందజేసింది. ఆ రోజు కోర్టుకు హాజరైన భువనేశ్వరి... తాను అమాయకురాలినని, తానే పాపం ఎరగనని పేర్కొంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్ మురుగన్ సాక్షుల వద్ద విచారణను ప్రారంభించారు. వ్యభిచార నిరోధ విభాగం ఎస్సై ధనచెయన్ కోర్టుకు హాజరై భువనేశ్వరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. యువతులతో ఉల్లాసంగా గడిపేందుకు భువనేశ్వరి తన వద్ద రూ. అయిదు వేలు అడిగారని తెలిపారు. కేసు విచారణను మేజిస్ట్రేట్ మురుగన్ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీచేశారు.
శృంగార నటి భువనేశ్వరిపై చీటింగ్ కేసుతో పాటు వ్యభిచారం తదితర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భువనేశ్వరిని రూ. 1.5 కోట్ల చీటింగ్ కు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీవీ సీరియల్ నిర్మిస్తానని నమ్మబలికి ఆమె తన వద్ద రూ. 1.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని చెన్నై కెకె నగర్ కు చెందిన రఘునాథన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భువనేశ్వరిని విచారించారు. విచారణలో భువనేశ్వరి... తాను అమాయకురాలిని అని వెల్లడించింది. తనకు ఇచ్చింది కొంతే అని. తెల్లకాగితంపై తన సంతకం తీసుకుని ఎక్కువ ఇచ్చినట్లు రాసుకుని తనను మోసం చేసారని భువనేశ్వరి ప్రత్యారోపణలు చేసింది.


Click it and Unblock the Notifications












