twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్సై సాక్ష్యం....ఇరుక్కున్న భువనేశ్వరి

    By Srikanya
    |

    చెన్నై : వ్యభిచార కేసుకు సంబంధించి నటి భువనేశ్వరికి వ్యతిరేకంగా సైదాపేట కోర్టులో ఓ ఎస్సై సాక్ష్యం చెప్పారు. యువతులను వ్యభిచార కూపంలోకి దింపారని నటి భువనేశ్వరిపై 2009 అక్టోబర్‌ 27న కేసు నమోదైంది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2010లో పోలీసులు సైదాపేట కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. బెయిల్‌ పొందిన భువనేశ్వరి అజ్ఞాతంలోకి వెళ్లడంతో విచారణలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఈజంబాక్కంలోని ఓ థియేటర్‌లో రగడ సృష్టించిన కేసులో ఇటీవల ఆమెను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం విదితమే.

    భువనేశ్వరి పై మరో రెండు మోసం కేసులు కూడా నమోదయ్యాయి. వ్యభిచార కేసుకు సంబంధించి గత 10వ తేదీ భువనేశ్వరికి సైదాపేట కోర్టు ఛార్జ్‌షీటు నకలు అందజేసింది. ఆ రోజు కోర్టుకు హాజరైన భువనేశ్వరి... తాను అమాయకురాలినని, తానే పాపం ఎరగనని పేర్కొంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్‌ మురుగన్‌ సాక్షుల వద్ద విచారణను ప్రారంభించారు. వ్యభిచార నిరోధ విభాగం ఎస్సై ధనచెయన్‌ కోర్టుకు హాజరై భువనేశ్వరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. యువతులతో ఉల్లాసంగా గడిపేందుకు భువనేశ్వరి తన వద్ద రూ. అయిదు వేలు అడిగారని తెలిపారు. కేసు విచారణను మేజిస్ట్రేట్‌ మురుగన్‌ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీచేశారు.

    శృంగార నటి భువనేశ్వరిపై చీటింగ్ కేసుతో పాటు వ్యభిచారం తదితర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భువనేశ్వరిని రూ. 1.5 కోట్ల చీటింగ్ కు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీవీ సీరియల్ నిర్మిస్తానని నమ్మబలికి ఆమె తన వద్ద రూ. 1.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని చెన్నై కెకె నగర్ కు చెందిన రఘునాథన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భువనేశ్వరిని విచారించారు. విచారణలో భువనేశ్వరి... తాను అమాయకురాలిని అని వెల్లడించింది. తనకు ఇచ్చింది కొంతే అని. తెల్లకాగితంపై తన సంతకం తీసుకుని ఎక్కువ ఇచ్చినట్లు రాసుకుని తనను మోసం చేసారని భువనేశ్వరి ప్రత్యారోపణలు చేసింది.

    English summary
    
 Actress Bhuvaneswari was taken into custody by the cops yet again and this time it's because of her involvement in a public brawl. After producing before the magistrate, she was remanded to 15 days judicial custody.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X