భూకంపం సృష్టిస్తున్న భువనేశ్వరి!
అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు' దిద్దుబాటు ఆచరిస్తోంది భువనేశ్వరి. నిన్నటి వరకూ చాలా కొద్దిమందికే తెలిసిన భువనేశ్వరి ఒక్క రాత్రితో ఎంతో వెలుగులోకొచ్చింది. ఇప్పుడు భువనేశ్వరి గురించి అందరికీ తెలుసు. బుల్లితెరపై పాపులర్ లేడి విలన్ పాత్రలు పోశిస్తూ, సినిమా్ల్లో ఎంటరై వేశ్య పాత్రలు మాత్రమే పోషిస్తుండే భువనేశ్వరి నిజజీవితంలోనూ అటువంటి పాత్రే పోషించడం భాధాకరం. ప్రభాస్ హీరోగా నటించిన చక్రం సినిమాలో టీనేజ్ అమ్మాయిల్ని పడుపు వృత్తిలోకి దింపే 'యాంటీ ఆంటీ" పాత్ర పోషించిన భవనేశ్వరి వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడం చిన్నసైజు సంచలనం సృష్టిస్తే, అరెస్ట్ అనంతరం ఆమె చేస్తున్న వ్యాఖ్యలు తమినాడులో పెను దుమారం సృష్టిస్తున్నాయి. రజనీకాంత్ సహా యావత్ తమిళ చిత్రసీమ రోడ్డుమీదకొచ్చి ముక్తకంఠంతో తమ నిరిసన తెలిపారంటే దాన్నిబట్టి భువనేశ్వరి వ్యాఖ్యల తీవ్రతను గుర్తించవచ్చు.
భారీ స్థాయిలో వ్యభిచారం సాగిస్తున్న బడా స్టార్ లను వదిలేసి, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వత్తిని స్వీకరించిన తనను కేసుల పేరుతో వేదించడం అమానుషమంటూ ఆక్రోశించడంతోనే సరిపెట్టుకోకుండా, ఈ వృత్తిలో ఫలానా ఫలానా తారలు కొనసాగిస్తున్నారంటూ భువనేశ్వరి వెల్లడించిన పేర్లు కోలీవుడ్ లో భూకంపం పుట్టిస్తున్నాయి. తన ఎదుగుదలను జీర్ణించుకోలేని వాళ్ళు కావాలని తనను ఈ కేసులో ఇరికించారని భావిస్తున్న భువనేశ్వరి తేనె తుట్టను కదిలించడం ద్వారా ఈ కేసునుంచి విముక్తి పొందాలని కుట్రపన్నుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











